Vijayadashami celebrations at Sai temples on the 25th

25 న సాయి ఆలయాలలో విజయదశమి వేడుకలు

Date:24/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

విజయదశమి పండుగ రోజున శ్రీ షిరిడిసాయిబాబా సమాధికాబడిన రోజు కావడంతో సాయి ఆలయాలలో ఆదివారం ప్రత్యేక పూజలు చేయనున్నారు. పట్టణ సమీపంలోని మాదనపల్లెలో వెలసిన షిరిడిసాయిబాబా ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయనున్నట్లు ఆలయ ధర్మకర్త పి.దక్షిణామూర్తి తెలిపారు.అలాగే పట్టణంలోని చెరువు కట్టపై వెలసిన సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త నాగరాజ తెలిపారు. కొత్తయిండ్లలో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త త్రిమూర్తిరెడ్డి తెలిపారు. సాయిబాబా సమాధికాబడిన పవిత్రదినాన్ని పురస్కరించుకుని భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని , సాయినాథునికు కృపకు పాత్రులుకావాలెనని నిర్వాహకులు కోరారు. ఈ సందర్భంగా సాయి ఆలయాలలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం 

Tags: Vijayadashami celebrations at Sai temples on the 25th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *