విజయమ్మ, షర్మిల పోటీకి సిద్ధం
హైదరాబాద్ ముచ్చట్లు:
కాంగ్రెస్ పొత్తు సక్సెస్ కాకపోవడంతో వైఎస్ఆర్టీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. వైఎస్ షర్మిల రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ విజయమ్మ కూడా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోవడంతో తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డిసైడ్ అయ్యారు. అయితే ఎన్నికల బరిలో తన తల్లి విజయమ్మను నిలపాలని షర్మిల భావిస్తున్నారని సమాచారం. దీంతో పాటు 100 సీట్లలో వైఎస్ఆర్టీపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పాలేరు, మిర్యాలగూడ 2 స్థానాలలో షర్మిల పోటీ చేయనున్నారని, సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ బరిలో నిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ముఖ్యనేతలతో సమావేశం అవుతున్న షర్మిల… నియోజక వర్గాల వారీగా పలువురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సూర్యాపేట నుంచి పిట్ట రాంరెడ్డి, సత్తుపల్లి నుంచి కవిత, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర రెడ్డి, నర్సంపేట నుంచి శాంతికుమార్, అదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్, చేవెళ్ల నుంచి దయానంద్, గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి, సిద్దిపేటలో నర్సింహారెడ్డి, సిరిసిల్లలో చొక్కాల రాము, కామారెడ్డి నుంచి నీలం రమేశ్, అంబర్ పేట నుంచి గట్టు రామచంద్రరావును ఎన్నికల బరిలో నిలిపేందుకు వైఎస్ఆర్టీపీ సన్నాహాలు చేస్తుంది.

Tags: Vijayamma and Sharmila are ready for the competition
