కూతురువైపే విజయమ్మ

హైదరాబాద్ ముచ్చట్లు:
వైఎస్ విజ‌య‌మ్మ‌. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌తీమ‌ణే అయిన‌ప్ప టికీ.. త‌న‌యుడు జ‌గ‌న్ కోసం.. రోడ్డెక్కిన ఆమె.. త‌ర్వాత రాజ‌కీయంగానూ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. వైఎస్సార్ మ‌ర‌ణం వ‌ర‌కు తెర‌చాటు గృహిణిగా ఉన్న ఆమె ఆ త‌ర్వాత పులివెందుల నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. త‌ర్వాత జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆమె పులివెందుల నుంచి వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసి త‌న మ‌రిది, మాజీ మంత్రి దివంగ‌త వివేకానంద‌రెడ్డి మీదే గెలిచారు. ఇక 2014 ఎన్నిక‌ల్లో విజయమ్మ వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఆమెచేసిన కామెంట్లు చూస్తే.. వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలిగా కాకుండా.. త‌న కుమార్తె.. తెలంగాణ‌లో పార్టీ పెట్టుకున్న ష‌ర్మిల వైపే మొగ్గు చూపుతున్నార‌నేది స్ప‌ష్టంగా తెలిసిపోయింది. తాజాగా తెలంగాణ‌లో ష‌ర్మిల‌.. వైఎస్సార్ టీపీ ని స్థాపించారు.వైఎస్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని జెండాను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌మ్మ చేసిన కామెంట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లోను, ముఖ్యంగా వైసీపీ వ‌ర్గాల్లోనూ తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావంతో వైఎస్‌ పాలనకు పునాదులు పడుతున్నాయ‌న్న విజయమ్మ ష‌ర్మిల‌ను సింహాల్లాంటి నాయకురాలిగా పోల్చారు. సింహానికి ఏ జెండర్‌ కూడా అడ్డు రాదన్నారు. నాయకురాలిగా తెలంగాణ గడ్డే షర్మిలమ్మ పుట్టినిల్లని తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర చేయాలని కోరితే.. జగనన్న బాణంగా చెబుతూ 3,200 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసింద‌ని తెలిపారు.కాలు ఫ్యాక్చరైనా.. ష‌ర్మిల పాద‌యాత్ర ఆపలేదని విజయమ్మ తెలిపారు. ఈ వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే.. పూర్తిగా విజ‌య‌మ్మ‌ ష‌ర్మిల వైపే మొగ్గు చూపుతున్నార‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కొద్ది రోజులుగా ఆమె వైసీపీ గౌర‌వాధ్య‌క్షురాలి హోదాలో ఉండి ఆ పార్టీ గురించి గాని.. త‌న‌యుడు జ‌గ‌న్ గురించి కాని ఎక్క‌డా మాట్లాడ‌డం లేదు. ష‌ర్మిల‌ను మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్ర‌స్తుతం విజయమ్మ వైసీపీ గౌరవ అధ్య‌క్షురాలిగా ఉన్న‌ప్ప‌టికీ.. ఇక‌, ఏపీ విష‌యంలోను, జ‌గ‌న్ విష‌యంలోనూ ఆమె పాత్ర త‌గ్గుతుంద‌ని.. కేవ‌లం త‌న కుమార్తెను హైలెట్ చేసుకోవ‌డంతోపాటు.. తెలంగాణలో రాజ‌కీయంగా దూకుడు చూపించేందుకు ప్రాధాన్యం ఇస్తార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ ప‌రిణామం.. అంటే.. విజ‌య‌మ్మ తీసుకున్న స్టాండ్‌ను బ‌ట్టి.. తెలంగాణ రాజ‌కీయాల‌కే ఆమె ప‌రిమితం కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Vijayamma on the daughter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *