Natyam ad

నూతన గవర్నర్ ను కలిసిన విజయసాయిరెడ్డి

విజయవాడ ముచ్చట్లు:


రాష్ట్ర నూతన గవర్నర్ గా అబ్దుల్ నజీర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనను రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజయవాడలో రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలియజేశారు.
ఏపిలో మరింత సులభంగా ఎగుమతులు : దేశ ఎగుమతుల్లో 10 శాతం వాటా సాధించాన్న లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఎగుమతుల్లో కీలకపాత్ర పోషించే కేంద్ర వాణిజ్యశాఖకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పొర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) కార్యకలాపాలు ప్రారంభించిందని వెల్లడించారు. జగన్ తోనే సామాజిక న్యాయం : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శాసన మండలి అభ్యర్థులుగా 18 ఖాళీలలో  11 బీసీలకు, 2 ఎస్సీలకు, 1 ఎస్టీలకు, 4 ఓసీలకు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయాన్ని అమలు చేశారని చెప్పారు.దీని ద్వారా శాసన మండలిలో  అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండటంతో పాటు వారి గొంతు వినిపించే అవకాశం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Tags; Vijayasai Reddy met the new Governor

Post Midle
Post Midle