విజయసాయిరెడ్డి సెటైర్లు

విజయవాడ   ముచ్చట్లు:
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు దీక్షనుద్దేశించి సెటైర్లు వేశారు. దీక్ష సత్యాగ్రహం ఎంతో నిబద్ధతతో చేయాల్సిన గాంధేయ పద్ధతి నిరసనలని విజయసాయి అన్నారు. కానీ ప్రచార ఆర్భాటాలతో చంద్రబాబు వాటిని ఈవెంట్ల స్థాయి దిగజార్చాడని విమర్శించారు. బాబు దీక్షలు చిత్తశుద్ధి లేని శివపూజలా తయారయ్యాయంటూ చురకలంటించారు. అయినా మూడు గంటల సినిమాలా మూడు గంటల దీక్షలేంటని ఆయన ఎద్దేవా చేశారు.చంద్రబాబు దీక్షకు నేతలు, కార్యకర్తలు కూడా కరువయ్యారని విజయసాయి అన్నారు. గంటల దీక్ష గంట కొట్టడం అంటే ఇదే. కనీసం గంటకు వంద మంది వచ్చి వెళ్లినా మూడొందల మంది హాజరయ్యారని చెప్పుకునే ఛాన్సుండేది. ఏమయ్యారు కార్యకర్తలు, ఎటు పారిపోయారు నాయకులు? అని ఎంపీ ఎద్దేవా చేశారు. ‘అకటా ఏమిటీ దుస్థితి. మన మీడియా లైవ్ వ్యాన్లు కూడా పెట్టినట్టు లేదే. ఎంత పరాభవం’ అని బాబు ఆత్మ ఘోషిస్తోందంటూ విజయసాయి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Vijayasaireddy Setairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *