చంద్రబాబు పై విజయసాయిరెడ్డి ఫైర్

Vijayasayeddy fire on Chandrababu fire

Vijayasayeddy fire on Chandrababu fire

Date:06/12/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును బ్లఫ్ మాస్టర్ అని, ఆయన మాటలు, హామీలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ఆయుష్షును 10 ఏళ్లు పెంచుతానని చెప్పిన చంద్రబాబు.. ఈసారి ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే రాష్ట్ర ప్రజలకు మరణమే లేకుండా చేస్తానని చంద్రబాబు హామీ ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. తన కుటుంబం తాగే హిమాలయా స్పెషల్ బ్రాండ్ వాటర్‌ను ప్రజలందరికీ అందిస్తానని చెబుతారంటూ విమర్శించారు. 2020 నాటికి ఏపీ జీడీపీని 7 రెట్లు పెంచుతానని చెప్పి చంద్రబాబు అడ్డంగా బుక్కయారు. ప్రజల ఆయుష్షు మరో పదేళ్లు పెంచుతాను లాంటి వ్యాఖ్యలు తమ దేశంలో చేస్తే పిచ్చాసుపత్రికి పంపిస్తారని స్విట్జర్లాండ్ అధికారులు అన్నారు. ఏపీకి వచ్చిన సింగపూర్ వాణిజ్య బందంతో మాట్లాడుతుండగా.. ఆర్థిక మంత్రి పాస్కల్ కల్పించుకుని చంద్రబాబు గాలి తీసేశారు. ఇలాంటి హామీలిస్తే తమ దేశంలో జైలుకు పంపిస్తారని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు తీరులో మార్పు రాలేదు. గతంలో కేవలం పాస్కల్ మాత్రమే చంద్రబాబు అబద్ధపు హామీలు, లెక్కలను ప్రశ్నించగా.. ప్రస్తుతం ఏపీ యువత మొత్తం చంద్రబాబును నిలదీసేందుకు సిద్ధంగా ఉంది. ఆయన ఇప్పటికైనా మారితే మంచిదని’ విజయసాయిరెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Tags:Vijayasayeddy fire on Chandrababu fire

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *