పత్తికొండ ముచ్చట్లు:
వికసిత్ భారత్ సంకల్పయాత్ర మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం, ఎంపీటీవో కవిత ఆధ్వర్యంలో నిర్వహించారు.పత్తికొండ మండల పరిషత్ కార్యాలయంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర సభలో బిజెపి పత్తికొండ నియోజకవర్గ కన్వీనర్ రంజిత్ కర్ణి మరియు కోకన్వీనర్ గోవర్ధన్ నాయుడు మాట్లాడుతూ,డిసెంబర్ 29 నుంచి జనవరి 6 వరకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పత్తికొండ మండలంలో ప్రతి రోజు ఒక పంచాయతీలో జరగబోతుంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రభుత్వ అధికారులు ఆ కార్యక్రమంలో తెలియజేస్తారు.జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ప్రజలకు అవగాహన, పథకాలు ఎంత వరకు అందుకున్నారనే అంశం తెలుసుకు నేందుకే యాత్ర సాగుతుందన్నారు వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం 2024 క్యాలెండర్ ఆవిష్కరించారు,ఈ కార్యక్రమంలో పోషణ శక్తి అభియాన్, ప్రధాన మంత్రి ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్ ,స్వయం సంఘాల ఉత్పత్తులు , పీఎం సురక్ష బీమా యోజన తదితర స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. హౌసింగ్ అధికారి , వ్యవసాయాధికారి. సెక్రటరీలు, కార్యక్రమంలో దండి మల్లికార్జున, పూనా మల్లికార్జున, బ్రహ్మయ్య, రామాంజినేయులు, శంకరయ్య ఆచారి, గజ్జల లక్ష్మణ నాయుడు, నారాయణ, స్వామి, భాస్కర్, శ్రీధర్ గౌడ్, కార్తిక్, సురేంద్ర రాంపల్లి, నరేష్, నాగ, చంద్ర, గోరంట్ల మరియు ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Tags: Vikasit Bharat sankalpayatra in every village