Vikataswamy death of public servant

ప్రజా ఉధ్యమనేత మిద్దింటి వెంకటస్వామి మృతి

– నివాళులర్పించిన ఎంపీ రెడ్డెప్ప
– నేడు మందకృష్ణ మాదిగ రాక

Date:22/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

దళిత కుటుంబంలో పుట్టి, ప్రజా ఉధ్యమనేతగా అంచలంచలుగా ఎదిగిన ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మిద్దింటి వెంకటస్వామి(54) శనివారం సాయంత్రం మృతి చెందారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సాయంత్రం అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈయనకు భార్య, కుమారుడు, కుమారై ఉన్నారు. ప్రజా ఉధ్యమాల్లో పాల్గొని, పేద ప్రజల మనిషిగా ఎదిగిన మిద్దింటి వెంకటస్వామి మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు విషాదంలో మునిగిపోయారు. కాగా వెంకటస్వామి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన పెద్దపంజాణి మండలం వెలగటూరులో ఆదివారం నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు. వెంకటస్వామి మృతి పట్ల వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అక్కిసాని భాస్కర్‌రెడ్డి, కొండవీటి నాగభూషణం, మాజీ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్‌, మాజీ ఎంపీపీ నరసింహులు సంతాపం తెలిపారు. అలాగే దళిత సంఘ నాయకులు శంకరప్ప, ఎన్‌ఆర్‌.అశోక్‌, రాజా, చిన్నప్ప, శ్రీనివాసులు, రమణ, నాగరాజ లు సంతాపం తెలిపారు.

ఎంపీ నివాళి…

దళితకుటుంబంలో పుట్టి, ఎంపీ రెడ్డెప్పకు అనుచరుడిగా ఉన్న వెంకటస్వామి మరణవార్త తెలిసిన వెంటనే రెడ్డెప్ప తీవ్ర దిగ్బ్రాంతికి లోనైయ్యారు. ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పేద ప్రజల కోసం పోరాటాలు చేసి, పలు మార్లు అరెస్ట్ అయినా పట్టువదలని దీక్షతో పేదల అభివృద్ధి కోసం వెంకటస్వామి పని చేశారని ఎంపీ కొనియాడారు. ముస్లిం మైనార్టీల నాయకుడు ఖాదర్‌బాషా, దళిత నేతలు శ్రీరాములు, మునస్వామి, రామచంద్ర, శంకరప్ప తదితరులు హాజరై నివాళులర్పించారు.

నేడు మందకృష్ణమాదిగ రాక…

ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ఆదివారం పుంగనూరు రానున్నారు. ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మిద్దింటి వెంకటస్వామి మరణించడంతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మందకృష్ణమాదిగ హాజరుకానున్నారు.

శివనామస్మరణతో భక్తుల మొక్కులు చెల్లింపు

Tags: Vikataswamy death of public servant

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *