దిశా యాప్ కు గ్రామస్థాయిలో అవగాహన

విశాఖపట్నం ముచ్చట్లు:

 

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశా యాప్  పై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.విశాఖలో దిశా యాప్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ దిశా యాప్ ద్వారా మహిళల భద్రతే ప్రధాన ద్యేయంగా కృషి చేయాలన్నామని చెప్పారు.దిశా పోలీస్ స్టేషన్ లు వచ్చాయని త్వరలో మహిళా కోర్టు లు రాబోతున్నాయని చెప్పారు. సైబర్ మిత్రా ని ప్రభుత్వం వచ్చిన వెంటనే లాంచ్ చేయడం జరిగిందని, ఏ ఫిర్యాదు అయినా తక్షణమే యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.మహిళా మిత్ర గా ఎవరైనా ఎన్ రోల్ చేసుకోవచ్చని పోలీస్ స్టేషన్ పరిదిలో మహిళా మిత్ర కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.స్పందన అనే కార్యక్రమంతో సామాన్య ప్రజలకు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉన్నారని దిశాయాప్ ద్వారా మహిళా లకు భద్రత, దైర్యం వచ్చిందని తెలిపారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Village level awareness for Disha app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *