Natyam ad

పల్లె జనం…పనులలో నిమగ్నం-ఎంపీపీ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారంకావడంతో ప్రజలు తమ పనులలో నిమగ్నమై జీవిస్తున్నారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి ఉలవలదిన్నె గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమబావుట బుక్‌లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ ఈశ్వరమ్మ, పార్టీ నాయకులు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, అయూబ్‌ఖాన్‌, రమణ, శ్రీనివాసులు, సుబ్రమణ్యంతో పాటు సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లు పాల్గొన్నారు.

Post Midle

Tags: Village people…engage in work-MPP Bhaskar Reddy

Post Midle