ఆస్కార్ రేసులో విలేజ్ రాక్ స్టార్స్ 

Village Rock Stars in Oscar race

Village Rock Stars in Oscar race

Date:22/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఆస్కార్‌కు అస్సాం సినిమా ఎంపికైంది. రిమా దాస్ డైరక్ట్ చేసిన విలేజ్ రాక్‌స్టార్స్ ఫిల్మ్.. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్స్ పోటీలకు భారత్ తరపున అర్హత సాధించింది. 2019, ఫిబ్రవరి 24న అకాడమీ అవార్డుల ప్రదానం ఉంటుంది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ సినిమాను ఆస్కార్స్‌కు ఎంపిక చేసింది. కన్నడ ప్రొడ్యూసర్ రాజేంద్ర సింగ్ బాబు నేతృత్వంలోని జ్యూరీ ఈ సినిమాను ఎంపిక చేసింది. అస్సాంలోని చయ్యాగావ్ క్రమంలో ఈ సినిమా సాగుతుంది.
డైరక్టర్ రిమా దాస్ స్వంత ఊరు ఇదే. పేద పిల్లలకు సంబంధించిన స్టోరీతో సినిమాను తెరకెక్కించారు. విలేజ్ రాక్‌స్టార్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. టొరంటోలో జరిగిన వరల్డ్ ప్రీమియర్‌లో ప్రశంసలు అందుకున్నది. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ దీన్ని ప్రదర్శించారు. 65వ జాతీయ అవార్డుల్లోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నది.
స్సాంలోని ఓ మారుమూల పల్లెటూరుకు చెందిన పదేళ్ల అమ్మాయి ‘ధును’కు గిటార్‌ అంటే ఎంతో ఇష్టం. అంతేకాక తనే సొంతంగా ఓ బ్యాండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కలలు కంటుంది. ఈ క్రమంలో ధును తనకు వచ్చిన ఇబ్బందులను ఎలా అధిగమించింది.. చివరకు తన కలను ఎలా సాకారం చేసుకుని రాక్‌స్టార్‌గా ఎదిగింది అనేదే ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ కథ.
రీమా దాస్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2018లో ఉత్తమ ఫీచర్‌ సినిమాగా జాతీయ అవార్డు సాధించింది. అంతేకాక ఈ చిత్రంలో ధును పాత్రలో నటించిన భనిత దాస్‌ ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అవార్డును అందుకుంది.గతేడాది వచ్చిన ‘న్యూటన్‌’ సినిమాతో పాటు అంతకు ముందు వచ్చిన ‘కోర్ట్‌’, ‘లయర్స్‌ డైస్‌’, ‘విసరానై’, ‘ద గుడ్‌ రోడ్‌’ వంటి చిత్రాలు ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యాయి.
కానీ ఒక్క చిత్రం కూడా ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఫైనల్‌ ఐదు చిత్రాల్లో నిలవలేదు. చివరిసారిగా 2001లో ‘లగాన్‌’ చిత్రం మాత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరిలో ఫైనల్‌ ఐదు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతకుముందు 1958లో ‘మదర్‌ ఇండియా’, 1989లో ‘సలాం బాంబే’ కూడా టాప్‌ 5కి వెళ్లాయి. కానీ ఇంతవరకూ ఒక్క భారతీయ చిత్రానికి కూడా ఆస్కార్‌ అవార్డ్‌ రాలేదు.
Tags:Village Rock Stars in Oscar race

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *