Natyam ad

గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం గ్రామ సచివాలయలు…

-గడప వద్దకే పాలన అందిస్తున్న సీఎం జగన్…

-శాశ్విత కార్యాలయ భవన నిర్మాణాలతో మారుతున్న పల్లెల రూపురేఖలు…

 

చిన్నమండెం ముచ్చట్లు:

Post Midle


చిన్నమండెం మండలం బోనమలలో ఒకే ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా, డా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలును జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డితో కలసి ప్రారంభించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా జగనన్న ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు నిలుస్తున్నాయని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లాఅధ్యక్షుడు,ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శనివారం చిన్నమండెం మండలం బోనమలలో ఒకే ప్రాంగణంలోనూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ రైతు భరోసా,డా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలును మాజీ జెడ్ పి వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, స్థానిక సర్పంచులు అప్రోజ్, లోకేశ్వర రెడ్డి లతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలోనే ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రజా అవసరాల నిమిత్తం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా వ్యయ, ప్రయాసలు లేకుండా చేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను అందచేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాలకు కోట్లాది రూపాయలుతో శాశ్విత కార్యాలయ భవనాలను నిర్మించి పల్లెల మార్పుకు శ్రీకారం చుట్టారన్నారు. రాయచోటి నియోజక వర్గంలో 73 సచివాలయాల నిర్మాణాల కు గాను 67 పూర్తి అయ్యాయని, 70 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు గాను 60 పూర్తి అయ్యాయని, ,60 విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలకు గాను 45 పూర్తి అయ్యాయన్నారు.

రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు…

రైతులకు విజ్ఞాన కేంద్రాలుగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలుగా ఉపయోగ పడుచున్నాయని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బోనమల గ్రామ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్ర నూతన భవన ప్రారంబోత్సవంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి తో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ రైతు సంక్షేమానికి కృషి చేసి రైతు పక్షపాతిగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు.వారి తనయుడు సీఎం జగన్ అదే బాటలో నడుస్తూ రైతుల సంక్షేమానికి అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు. ప్రతి పంటనూ రైతులు ఈ క్రాపింగ్ చేయించుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాలలో రైతులు పండించిన పంటలును ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పించిందన్నారు.

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన సీఎం జగన్…

విలేజ్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి తో కలసి పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

వైద్యరంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి లు అన్నారు.బోనమల వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నూతన భవనం ప్రారంభంలో శ్రీకాంత్ రెడ్డి, దేవనాధ రెడ్డి లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి,దేవనాధ రెడ్డి లు మాట్లాడుతూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామంలోనే వైద్యసేవలు అందుబాటులో ఉండేలా ప్రతి 2500 జనాభాకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లును ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లును నియమించారన్నారు. ఈ క్లినిక్ లో12 రకాల వైద్యసేవలు అందించడంతో పాటు 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.65 రకాల మందులతో పాటు67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంటుందన్నారు.ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటివద్దకే నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, సర్పంచులు నజీర్ అహమ్మద్, లక్ష్మి రెడ్డి, ఎంపీటీసీ లు ఎజాస్ అలీ ఖాన్,శ్యామ్ చంద్ర,జేసీ యస్ మండల కన్వీనర్ చుక్కా అంజనప్ప, జేసీబి శేఖర్, మురళి,రాజు,ఆనంద్, హసన్ భాషా, భాస్కర్ నాయుడు, చంద్రపాల్,రెడ్డిశేఖర్జ్ వెంకటేశ్వర్లు, మల్ రెడ్డి, యహియా ఖాన్,జహీర్ ఖాన్,జయశంకర్ రెడ్డి, బురాన్ ఖాన్,రమణ సచివాలయ సిబ్బంది,గ్రామ వలేంటరీలు పాల్గొన్నారు.

Tags: Village secretariats are the counterpart of village swaraj.

Post Midle