భిక్షాటన చేసిన గ్రామ సేవకులు

-అయ్యా బిక్షం, అమ్మ బిక్షం, అంటూ ర్యాలీ లో నిరసనలు
-గ్రామ సేవకులకు కనీస వేతనం 21వేల అందించాలి
కౌతాళం ముచ్చట్లు:
 
రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏ లా సమస్యలను  పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్  కార్యాలయం  ముందు చేస్తున్న నిరసనలు నిరాహార దీక్షలు 7  రోజున చేరాయి. సోమవారం విఆర్ఏ గ్రామ సేవకులు తహసిల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి అయ్య, భిక్షం ,అమ్మ భిక్షం అంటూ భిక్షాటన చేస్తూ  మా సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతూనే ఉంటామని రైతు సంఘం ఉపాధ్యక్షులు మల్లయ్య ప్రహల్లాద తదితరులు వాపోయారు. ఈ సందర్భంగా రిలే నిరాహార దీక్షలు నిర్దేశించి రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు మల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము వీఆర్ఏ ల ను నిర్లక్ష్యం చేస్తూ తూ వారి యొక్క సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు..వి .అర్. ఏ లకు కనిసవేతనం రూ 21,000/లు ఇ వ్వాలని, డి ఏ తో కలిపి వేతనం ఇ వ్వాలి. నమీ నీ లను వి ఆర్ ఏ లుగా నియమించాలని, అర్హులైన వారికి కి అర్హులైన వారికి ప్రమోషన్ ఇవ్వాలని అన్నారు. 65 సంవత్సరాలు దాటి చనిపోయిన వీఆర్ఏ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పై డిమాండ్లు సాధన కోసం  రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయని అన్నారు.
 
 
గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు ఆందోళన రూపంలో విన్నవించినా ఫలితం లేకపోవడం వల్ల అంచెలంచెలుగా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం అయినది. మండల కేంద్రాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆఖరికి విజయవాడలో కార్యక్రమాన్ని రూపొందించుకోవడం అయినది. ఈ పోరాట పటిమను పటిష్ట పరుస్తూ ఆందోళనలో ఉద్ధృతం చేయడానికి ప్రతి గ్రామ సేవకుడు  ముందుకు రావాలని ఆయన అన్నారు.ఈ నిరాహార దీక్షలో అన్ని గ్రామాల గ్రామ సేవకులు పాల్గొన్నారు . నాయకులు ప్రహల్లాద, నాగరాజు, మారెప్ప ,నర్సింలు, చెన్నప్ప ,బసన్న  ,అయ్యమ్మ, హనుమంత్ మ్మ, ఉరుకుంద, అంపయ్య, గోపాల్. తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Village servants begging

Leave A Reply

Your email address will not be published.