గ్రామ గ్రామాన నర్సరీలు

Date:19/07/2018
మెదక్ ముచ్చట్లు:
గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. పల్లెకో నర్సరీ ఏర్పాటు ప్రక్రియలో గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖలు కీలకంగా మారనున్నాయి. గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ ఆధ్వర్యంలోనే వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నర్సరీల్లో పల్లెవాసులకు అనుబంధంగా ఉండే మొ క్కలు ఎక్కువగా ఉండనున్నాయి. వీటి ఏర్పాటుపై రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రస్థాయి లో శిక్షణ పొందిన అధికారులు జిల్లాస్థాయిలో శిక్షణ అందిస్తా రు. జిల్లాస్థాయిలో శిక్షణ పొందిన వారు మండల స్థాయిలో శిక్షణ ఇస్తారు. జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచుల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టనుంది. జిల్లాలోని పంచాయతీల్లో ఏర్పాటు చేయనున్న నర్సరీలు, పల్లెలకు హరిత శోభను తీసుకురానున్నాయి. జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 526 గ్రామ పంచాయతీలున్నాయి. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం గతంలో ఐదేళ్లకు ఒకసారి ఉన్న సర్పంచుల రిజర్వేషన్‌ను పదేళ్లకు పెంచనున్నారు. సర్పంచి, ఉప సర్పంచికి ఉమ్మడిగా చెక్ పవర్, ఇలాంటి అనేక మార్పులు తీసుకు రానుంది. అందులో భాగంగానే ప్రతీ గ్రామ పంచాయతీలో కొత్త నర్సరీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొక్కల పెంపకం, సం రక్షణ సర్పంచులు, కార్యదర్శలుగా బాధ్యత వహించనున్నారు. ప్రతీ పంచాయతీలో ఒక నర్సరీ చొప్పున జిల్లావ్యాప్తంగా 5 వం దలకు పైగా నర్సరీలు ఏర్పాటు చేయనున్నారు. చిన్న పంచాయతీలో ఒక నర్సరీలో 20 వేలు, పెద్ద పంచాయతీలో 40 వేల మొ క్కల చొప్పున పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు.ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల హడావిడీ వినిపిస్తోంది. ప్రజాప్రతినిధులకు పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో నర్సరీల ఏర్పాటుపై శిక్షణ, అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉండదని అధికారులు భావిస్తున్నా రు. కొత్త సర్పంచులు కొలువు తీరడానికి ఇంకా సమయం ఉం ది. ఇటువంటి సమయంలో ఎవరికీ శిక్షణ కల్పించాలనే స్పష్టత కొరవడగా జిల్లా యంత్రాంగం కాస్తా ఉన్నతాధికారులను సం ప్రదిస్తున్నారు. అడవులు రోజురోజుకు హరించుకుపోతుండడం తో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు, కరవు వెంటాడతుండడం మనం చూస్తున్నాం. వర్షాల జాడ లేక నీటి కరవును ఎదుర్కొంటున్నాము. ఇలాంటి పరిస్థితుల్లోనూ పచ్చదనం పెం చుతూ తద్వారా పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం కీలకంగా మారింది. నర్సరీల ఏర్పాటుకు నిధులు, నిర్వహణ, తదితర వాటికి పక్కాగా అమలు చేస్తే పల్లె సీమలు హరితశోభితంగా రూపుదిద్దుకోనున్నాయి.
గ్రామ గ్రామాన నర్సరీలుhttps://www.telugumuchatlu.com/village-village-nurseries/
Tags; Village village nurseries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *