జిల్లా ఎస్.పి కి గ్రామస్తుల కృతజ్ఞతలు
కడప ముచ్చట్లు:
వృద్ధ మహిళ ఆవేదనను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఆపన్న హస్తం అందించారు. వివరాల్లోకెళితే.. బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ నగర్ కు చెందిన షేక్ మస్తాన్ బి తన ఆర్ధిక ఇబ్బందులను తెలియచేస్తూ సోషల్ మీడియా లో మాట్లాడిన వీడియో వైరల్ గా మారి జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ దృష్టికి రావడంతో చలించిపో యారు. తక్షణమే స్పందించిన జిల్లా ఎస్.పి మైదుకూరు డి.ఎస్.పి ఎస్.ఆర్ వంశీధర్ గౌడ్, మైదుకూరు రూరల్ సి.ఐ నరేంద్ర రెడ్డి లతో మాట్లాడి హుటాహుటిన బ్రహ్మంగారి మఠం కు వెళ్లి షేక్ మస్తాన్ బి కి సాయం అందించాల్సిందిగా ఆదేశించారు. వెంటనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి నెల రోజులకు సరిపడా బియ్యం, సరుకులను అందచేశారు. అనంతరం సంబంధిత అధికారు లతో మాట్లాడి వృద్ధురాలికి పెన్షన్ వచ్చేలా కృషి చేశారు. జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ మానవతా దృక్పధంతో ప్రత్యేక చొరవ తీసుకుని వృద్ధురాలికి సాయం చేయడంతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడి పెన్షన్ వచ్చేలా చేసినందుకు వృద్ధురాలు షేక్ మస్తాన్ బి తో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్.పి కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Villagers are thankful to District SP
