విఆర్వోలను నిర్బంధించిన గ్రామస్తులు

Date:12/06/2019

జయశంకర్ భూపాలపల్లి  ముచ్చట్లు:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వాళ్లంకుంట గ్రామస్తులు కన్నెర్ర చేశారు. తమ భూములను పట్టా చేయాలని రెవెన్యూ విఆర్వోల తోపాటు విఆర్ ఏ లను గ్రామపంచాయతీ

కార్యాలయంలో నిర్బంధించి తాళం వేశారు. వాళ్లంకుంట గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ భూములను పట్టాకై తహశీల్దార్ కార్యాలయం చుట్టు తిరిగినా పనులు కావడం లేదని నిన్న తాడిచెర్ల

తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ను  రైతులు నిలదీసారు. మీ ఊరికి వచ్చి మీ భూమీ సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మార్వో అననడంతో రైతులు వెనుతిరిగారు.  మరుసటి రోజు ఎమ్మార్వో

రాకుండా వీఆర్వో లు రవి(వాళ్లెంకుంట),సురేందర్(మల్లారం),మల్లేశ్(రుద్రారం) లను పంపించారు సంవత్సరం నుండి తిప్పించుకుంటూ  భూములు పట్టచెయ్యకుండా సాకులు చెప్తున్నారని

ఆగ్రహించిన రైతులు వాళ్లెంకుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముగ్గరు విఆర్వోలను, ముగ్గురు మహిళ విఆర్ ఏలను నిర్బంధించారు. గ్రామ సర్పంచి, గ్రామస్తులు  రైతులకు నచ్చచెప్పడంతో

తాళం తీసి వారిని బయటికి తీసుకొచ్చారు.

 

కార్పొరేట్ ఆస్పత్రులు గా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతాం

Tags:Villagers detained by villagers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *