వాగు లో చిక్కుకున్న గ్రామస్థులు

అసిఫాబాద్ ముచ్చట్లు:

 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లోని కిషన్ నాయక్ తండా లో  మొదలైన వాగు కష్టాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు వాగు దాటి కిషన్ నాయక్ తండ కు మొక్కల లోడుతో ట్రాక్టర్ జెసిబి వెళ్ళాయి కార్యక్రమం ముగించుకొని తిరిగి సాయంత్రం వాగు దాటే క్రమంలో ఒక్కసారిగా పైన కురిసిన భారీ వర్షాల కారణంగా వాగు ఉప్పొంగడంతో జెసిబి ట్రాక్టర్ వాగు మధ్యలో ఇరుక్కుపోయాయి ట్రాక్టర్ మాత్రం ఇంజన్ పూర్తిగా మునిగిపోవడంతో జెసిబి సాయంతో వాగులో కొట్టుకుపోతున్న ట్రాక్టర్ని తండావాసులు కలిసి  బయటకు తీశారు ఇదే క్రమంలో అదే గ్రామానికి చెందిన వృద్ధుడు 4 రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి నుండి ఈరోజు డిచార్జ్ అయ్  వాగు దాటి తండా కు వెళుతున్న క్రమంలో వృద్ధుని నలుగురు యువకులు కట్టే సహాయంతో గుడ్డలో కట్టి బయటకు తీసిన దుస్థితి ఏర్పడింది. ఈ కష్టాలు ఇంకెన్నాళ్లు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా వాగుపై వంతెన నిర్మించి మమ్మల్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Villagers trapped in the swamp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *