-పంచాయితీ కార్యదర్శి పై మండిపడ్డ గ్రామస్తులు
Date:25/01/2021
కౌతాళం ముచ్చట్లు:
యువత చైతన్యంతోనే గ్రామ అభివృద్ధితో శుభ్రం అయ్యింది. రాజశేఖర్ అనే యువత మసీదిలకు, గుడిలకు, మరియు అన్ని ట్రాఫిక్ సర్కెల్ దగ్గర (సీ సీ టీవి). అమార్చేవాడు. నేడు మన గ్రామంలో ఉన్న డ్రైనేజి పరిస్థితి చూసి తన సొంత ఖర్చుతో గ్రామంలో ఉన్న అంతా చెత్తచెదారం అన్నిటినీ శుభ్రం చేయించాడు. వివరాల్లోకి వెళితే గ్రామంలో కానరాని చిత్తశుద్ధి ఎక్కడికక్కడే పేరుకుపోతున్న చెత్తాచెదారం విజృంభిస్తున్న దోమలు. గ్రామంలో డ్రైనేజి ఇంతలా అస్తవ్యస్తంగా మారడంతో పెద్దలు, పిల్లలు, వృద్ధులు, గ్రామవాసులు అంతా నరకయాతన పడుతున్నారు. కాలువలపై ఉన్న మురుకునీరు రహదారిపై చేరి బురదమయంగా మారి దుర్వాసన వెదజల్లడంతో ముక్కున వేలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పట్టించుకొని అధికారులు. గత కొన్ని నెలలుగా అస్తవ్యస్తంగా మారిన మా గ్రామం వైపు చూడండి అని ఎన్నిసార్లు అధికారులకు విన్నపించిన అధికారులు మాత్రం పెడచెవిన పెట్టారని నదిచాగి గ్రామవాసులు తెలిపారు. మరియు ఎన్నిసార్లు చెప్పిన పట్టిచ్చుకొని పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags: Villages develop with youth consciousness.