విలన్లకు భారీ రెమ్యూనిరేషన్లు

Villains have huge repairs

Villains have huge repairs

Date:17/08/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
దక్షిణాదిన ఒకప్పటి హీరోలు ఇప్పుడు విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అవతారం ఎత్తి… సత్తా చూపుతున్నా, మన దగ్గర బాలీవుడ్ విలన్లకు ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. హిందీలో కూడా హీరోలుగా అవకాశాలు లేని చాలా మంది విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారారు. అలాంటి వారికి మనోళ్లు అవకాశాలు ఇస్తూ ఉన్నారు. అయితే ఈ అవకాశాలకు వారు భారీ రెమ్యూనరేషన్లే పొందుతున్నట్టుగా తెలుస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న సినిమాలో ఒకనాటి బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వరకే నెగిటివ్ రోల్స్ చేసిన అనుభవం ఉన్న వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడు. బోయపాటి సినిమాల్లో విలన్ పాత్రలకూ చాలా ప్రాధాన్యతే ఉంటుంది.
దీంతో బాలీవుడ్ నటుడిని విలన్‌గా తెచ్చినట్టున్నారు. మరి ఈ సినిమాలో నటిస్తున్నందుకు గానూ వివేక్ ఒబెరాయ్ భారీ పారితోషికాన్నే పొందుతున్నాడని సమాచారం. ఏకంగా నాలుగు కోట్ల రూపాయల మొత్తాన్ని రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నాడట వివేక్. ఇది భారీ రెమ్యూనరేషన్ అని చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం దక్షిణాదిన నెగిటివ్ రోల్స్‌కు ఈ స్థాయి మొత్తాన్ని డిమాండ్ చేసే వాళ్లు ఎవ్వరూ లేరు.
అయితే వివేక్ ఒబెరాయ్ మాత్రం తన స్థాయి నాలుగు కోట్ల రూపాయలని స్ఫష్టం చేసి ఆ మేరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.
Tgas:Villains have huge repairs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *