వినాయక చవితి ఏర్పాట్లు -పందిరిలు ఏర్పాటు
– వినాయక ప్రతిమలు, పత్రి వ్యాపారాలు
పుంగనూరు ముచ్చట్లు:

వినాయక చవితి పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్దమౌతున్నారు. సోమవారం వినాయకుడిని నిలిపి పూజలు చేయనున్నారు. పట్టణం, మండలంలో కలసి 173 ప్రాంతాలలో వినాయక విగ్ర హాలను పెట్టనున్నారు. ఈ మేరకు పందిరిలు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. పట్టణంలో పండుగ సంత ఆదివారం జరిగింది. పూజకు అవసరమైన మట్టి వినాయకుడి ప్రతిమలు, ఆరటి, మామిడి, వెలగ, జామ , దానిమ్మ, జిల్లేడు, బిల్వపత్రి , గరిక పత్రాలు , చాటలు, పుటికలు, పండ్లు విక్రయాలు జోరుగా సాగాయి. వినాయకుడికి ప్రీతికరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన ప్రజలతో పట్టణం క్రిక్కిరిసింది. 10 రోజుల పాటు చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి ఏర్పాట్లు చేపట్టారు. సీఐ రాఘవరెడ్డిల ఆధ్వర్యంలో ఎస్‌ఐ మోహన్‌కుమార్, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.
Tags; Vinayaka Chavithi arrangements -setting up
