2వ తేదీ శ్రీకపిలేశ్వరాలయంలో వినాయక చవితి

Date:31/08/2019

తిరుమల ముచ్చట్లు:

శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 2వ తేదీ సోమ‌వారం వినాయక చవితి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

 

 

 

 

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ వినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

 

 

 

ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మొదటి ఘాట్‌ రోడ్డులో వినాయక చవితిపూజ

Tags: Vinayaka Chavithi at Srikapileswaram on the 2nd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *