పుంగనూరులో భక్తిశ్రద్దలతో వినాయక చవితి
పుంగనూరు ముచ్చట్లు:
వినాయక చవితి పండుగ సందర్భంగా సుమారు 10 నుంచి 15 అడుగుల ఎత్తు గల వినాయక విగ్రహాలను పట్టణంలో ఏర్పాటు చేశారు. మంగళవారం నిర్వాహకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతిబొప్పాబోరియా అంటు ప్రజలు, యువకులు నినాదాలు చేశారు. వివిధ అలంకారాలలో రంగురంగుల వినాయకుడి విగ్రహాలను పట్టణంలోని కట్టక్రిందపాళ్యెం, తేరువీధి, హైస్కూల్‌వీధి, తూర్పువెహోగశాల, బాలాజి •యేటర్‌వద్ద, నాగపాళ్యెం, బస్టాండు, బజారువీధి, ఎన్‌ఎస్.పేట తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకొక్క వార్డుకు రూ.20 వేలు చొప్పున రూ.6.20 లక్షలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు వినాయక విమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పట్టణంలో వినాయకుడి విగ్రహాల ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐ మోహన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఏర్పాట్లు చేపట్టారు.

Tags: Vinayaka Chavithi with devotees in Punganur
