Natyam ad

పర్యావరణ వినాయకా… ప్రణమామి!

మట్టి విగ్రహాలనే వినియోగిద్దాం::

ప్రజల్లో చైతన్యానికి బాలాకాడమి సంస్థల కృషి

నంద్యాల ముచ్చట్లు:

Post Midle


వినాయక చవితి పండగ కోసం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎదురు చూస్తుంటారు. తమ ఇంట్లో గణనాథుని ప్రతి మేము పెట్టి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు. చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటూ వివిధ రంగుల్లో కనిపించే బొమ్మలను అత్యధిక మంది కొనుగోలు చేస్తుంటారు. పండుగ కార్యక్రమాలు అనంతరం చెరువులు. నదులు, కాలువల్లో  నిమజ్జనం చేస్తారు. వీటిని రసాయనాలతో తయారు చేయడంతో జల కాలుష్యానికి కారణమవుతున్నాయి. పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది. ప్రజల్లో మార్పు తీసుకొస్తేనే దీనికి అడ్డుకట్ట పడుతుంది. దీనిని గుర్తించి బాలాకాడమి రవింద్ర పాఠశాల సేవా సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రతి ఏటా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా అందజేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు.. మట్టి వినాయక ప్రతిమలను తయారు వేయించి పండుగ రెండు రోజుల ముందు ప్రదర్శన నిర్వహి స్తారు. పాఠశాల లో చదువుతున్న విద్యార్థులందరికి వాటిని ఉచితంగా ఇస్తారు .
ప్రకృతిని కాపాడుకో పాలనే లక్ష్యంతో మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ యమ్ జీ వి రవింద్ర నాథ్. ప్రిన్సిపాల్ మాధవి లత తెలిపారు.
ఓ వైపు పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. , పూజలో పత్రిగా వినియో గించే 21 రకాల మొక్కలలో ఉన్న ఔషధాలు వివరిస్తూ ప్రచార ప్రతులను పంపిణీ చేస్తున్నారు.

 

Tags: Vinayaka of environment… Pranamami!

Post Midle