ప్రతిభకు వికలత్వం అడ్డుకాదు అని నిరూపించిన వినీత

Date:03/12/2019

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జర్నలిస్టు కాలనీలో నివాసముంటున్న సీనియర్ జర్నలిస్టు యమ్ వి . రమణారెడ్డి- యమ్ .లింగేశ్వరి ల ఏకైక కూతురు యమ్ .వినీత ప్రతిభకు వికలత్వం అడ్డుకాదని నిరూపించారు. పుట్టు మూగ , చెవుడు (బదిర) విద్యార్థిని వినీత  నంద్యాల మండలం అయ్యలూరుమెట్టలో ఉన్న నవజీవన్ మూగ , చెవిటి పిల్లల ప్రత్యేక పాఠశాల లో 1 నుండి10 వ తరగతి వరకు చదివింది. కడప హేలన్ కెల్లర్ బదిరుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసింది. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ, పీజీ .కళాశాల లో డిగ్రీ, పీజీ . పూర్తి చేసింది. కర్నూలు జిల్లా లోని మారుమూల గ్రామం కొత్తపల్లి మండలం శింగరాజుపల్లె గ్రామంలో యమ్ వీ .రమణారెడ్డి – యమ్ .లింగేశ్వరిలకు ఏకైక సంతానంగా జన్మించిన వినీత పుట్టుకతోనే  మూగ, చెవుడు కావడంతో వినీత విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు నంద్యాలకు వచ్చి వినీతను చదివించారు. 10 వ తరగతి లో స్కూల్ ద్వితీయ స్థానంలోనూ,ఇంటర్మీడియట్ లో కళాశాల ప్రథమశ్రేణిలో, డిగ్రీ, పీజీ . లలో ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించారు. కడప జిల్లా అంతర్ కళాశాలలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో ప్రథమ బహుమతి, ఫెన్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావు శిక్షణ లో ఫెన్సింగ్ ( కత్తి యుద్ధం) పోటీలలో కాకినాడ లో జరిగిన రాష్ట్ర స్థాయిలో , నంద్యాలలో జరిగిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభను చూపి పంజాబ్ క్రీడాకారిణి తో తలపడి రన్నర్ గా జాతీయ స్థాయి బహుమతి సాధించారు.

 

 

 

 

 

 

 

కళారాధన మరియు నంద్యాల డివిజన్ దివ్యాంగుల సంక్షేమ సంఘం  ప్రోత్సాహంతో చిత్రలేఖనం, గ్రూప్ నృత్యం తదితర పోటీలలో అత్యుత్తమ ప్రతిభను చూపి దివంగత యమ్ యల్ ఏ . భూమా నాగిరెడ్డి చేతుల మీదుగా “ఆత్మవిశ్వాస పురస్కారం ” అందుకున్నారు. శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి – విజయకుమారి దంపతులు అత్యాధునిక చెవిటి మిషన్ (హియరింగ్ మిషన్) అందించి ఆడియాలజిస్టుతో మాటలు వచ్చేందుకు వినీతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి డిగ్రీ, పీజీ . వరకు ఉచిత విద్యను అందించారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వినీత  చదువుతో పాటు క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ చూపి అనేక బహుమతులు సాధించారు. ప్రతిభకు వికలత్వం అడ్డురాదని నిరూపించారు. చుట్టుప్రక్కల వారి మాటలు వినపడక , చదువు ,క్రీడలలో అనేక అవమానాలు జరిగినా ఆత్మవిశ్వాసంతో సైగల లాంగ్వేజ్ ( చేతిసైగల ద్వారా) వాటిని అధిగమించి ముందుకు సాగారు.  ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 3 వ తేదీన కర్నూలు కలెక్టరేట్ , సునయన ఆడిటోరియంలో కర్నూలు యమ్ యల్ ఏ . హఫీజ్ ఖాన్, జిల్లా    జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్దీన్, దివ్యాంగుల ఎడిఎ  భాస్కర్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా ” జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగ” నియామక  పత్రాన్ని వినీత అందుకున్నారు. బదిర విద్యార్థిని వినీత ప్రతిభను కీర్తిస్తూ 22 ఏళ్ళకే ప్రభుత్వ ఉద్యోగం అందుకున్నందుకు పలువురు ప్రముఖులు విలేకరులు అభినందించారు.

 

కార్మికులు సంక్షేమ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలి

 

Tags:Vineeta has proved that talent does not hinder diversity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *