Natyam ad

ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి నిషేధిత రసాయనాలతో తయారైన బాణాసంచా విక్రయిస్తే కఠిన చర్యలు

.. జిల్లా యస్.పి   పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్…

– జిల్లాలో అక్రమంగా టపాసుల తయారీ, సరఫరా, విక్రయాలు చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు.

– రానున్న దీపావళి పండుగ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి టపాసులు విక్రయించినా, నిల్వ ఉంచినా చట్ట ప్రకారం చర్యలు.

Post Midle

– జిల్లాలో లైసెన్సు కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధలనకు లోబడి బాణసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలి.

– బాణసంచా వంటి పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచరాదు..బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత ప్రమాణాల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకొని విక్రయించుకోవాలి.

– షాపుల వద్ద నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి.

– ప్రభుత్వం వారు జారీ చేసిన నిబంధనలకు ఉల్లంఘన జరిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పువని జిల్లా ఎస్పీ   పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్  హెచ్చరించారు

 

తిరుపతి  ముచ్చట్లు:

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  పరమేశ్వర్ రెడ్డి ఐఎఫ్ఎస్సి  మాట్లాడుతూ గ్రీన్ క్రాకర్స్ ముసుగులో నిషేధిత రసాయనాలతో తయారైన బాణాసంచా బాక్సులపై లేబుళ్లను మార్చి విక్రయించినా, అక్రమంగా నిల్వ ఉంచినా, ప్రభుత్వ అనుమతి లేకుండా విక్రయించినా, రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.దీపావళి పండుగ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి టపాసులు విక్రయించినా నిల్వ ఉంచినా చట్ట ప్రకారం చర్యలు తప్పవు. జిల్లాలో బాణసంచా తయారీ లేదా విక్రయాలు లైసెన్సు కల్గిన వారు ప్రభుత్వ నియమనిబంధలనకు లోబడి ఉండాలి. బాణసంచాలు పేలుడు పదార్థాలు ఇంట్లో నిల్వ ఉంచరాదు. బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతల మేరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేసుకోని విక్రయించాలి. షాపుల వద్ద మండే స్వభావం కల్గిన వస్తువులు ఉంచరాదు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోనీ. బాణసంచా దుకాణాలకు దూరంలో వాహనాలను నిలుపుకునేలా చూసుకోవాలనీ. అలా కాదని నిబంధనలకు ఉల్లంఘన జరిగితే చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు.ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు దీపావళి సందర్భంగా బాణసంచా కొనుగోలుదారులు, అమ్మకం దారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. టపాసులు విక్రయించే షాపుల మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలి. బాణసంచా కాల్చేవారు, దీపాలు వెలిగించే వారు తగిన జాగ్రత్తలను పాటిస్తూ కాలుష్య రహిత టఫాసులు మాత్రమే కాల్చాలన్నారు.జిల్లాలో తాత్కాలిక బాణసంచా విక్రయాలకు అనుమతులు పొందిన వారంతా నిర్ణీత ప్రాంతంలోనే విక్రయాలు జరపాలన్నారు, ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జనావాస స్థలాల్లో విక్రయాలు జరిపినా, అనుమతులు లేకుండా విక్రయాలు జరిపే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడాలని చూసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నామని పత్రికా ముఖంగా జిల్లా ఎస్పీ తెలిపారు.

 

Tags: Violating government norms and selling firecrackers made with banned chemicals will face strict action

Post Midle