పేకాటలో వీఐపీలు.

హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీలో పేకాట డెన్‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది పేకాటరాయుళ్లను () పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి ఏకంగా రూ. 90 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడం గమనార్హం. సోమవారం రాత్రి కొందరు ప్రముఖులు పేకాట ఆడుతున్నట్లు డీసీపీకి సమాచారం అందడంతో మెరుపు దాడి చేసి ఈ పేకాట రాయుళ్ల గుట్టురట్టు చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్‌ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. కాకతీయ హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు గుట్టురట్టు చేశారు. పట్టుబడ్డ ఎనిమిది మందిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
Tags:VIPs in poker

Leave A Reply

Your email address will not be published.