అనంతలో వైరల్ ఫీవర్

Viral Fever in Infinity

Viral Fever in Infinity

Date:18/09/2018
అనంతపురం ముచ్చట్లు:
వైరల్, డెంగీ జ్వరాలు ప్రబలడంతో హిందూపురం జిల్లా ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. పట్టణశివారులోని మురికివాడల నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి మలేరియా, టైఫాయిడ్, వైరల్‌ ఫీవర్స్‌ బాధపడుతున్న వారు వందలాదిగా ఆస్పత్రికి తరలివస్తున్నారు. జ్వరపీడితుల్లో చిన్నారులే ఎక్కువగా ఉండడం… డెంగీ లక్షణాలు కనిపిస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది.
హిందూపురం ఆస్పత్రిలో 20 మంది వైద్యులుండాలి. కానీ ప్రస్తుతం 12 మందే ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇన్‌పేషెంట్ల సంఖ్య మూడొంతులు పెరగడంతో ఇక్కడి వైద్యులు అందరికీ మెరుగైన వైద్యసేవలందించలేకపోతున్నారు. మరోవైపు మంచాల కొరత వేధిస్తుండడంతో ఒకే మంచంపై ముగ్గురిని ఉంచి చికిత్సలు చేస్తున్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో మరికొందరిని నేలపైనే పడుకోబెట్టి చికిత్సలు చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో కనీస వసతులు లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చిన వారంతా నరకం చూస్తున్నారుప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వసతులు లేకపోవడం…కనీసం బెడ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో జనం అంతా ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో హిందూపురం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి.
ఏ ఆస్పత్రి వద్ద చూసినా చాంతాడంత క్యూ ఉంటోంది. ఇక చిన్నపిల్లల ఆస్పత్రుల వద్ద రద్దీ చెప్పలేనంతగా ఉంది.  దీంతో గంటల తరబడి వేచి చూస్తే గానీ చిన్నారులకు వైద్యం అందడం లేదు. టోకెన్‌ పేరుతోనే రూ. వందలు వసూలు చేస్తున్న ప్రైవేటు వైద్యులు… చిన్నపాటి జర్వానికే రక్త, మూత్రపరీక్షలు చేయిస్తున్నారు.
దీనికి తోడు వేలాది రూపాయల మందులు, టానిక్‌లు రాసిస్తూ ప్రజలు దోచుకుంటున్నారు. దీంతో పేదలు అప్పులు చేసి మరి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.నీరు కలుషితం కావడం వల్లే వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఎటుచూచినా అపరిశుభ్రత…దోమలు, పందుల బెడద ఎక్కువగా ఉండడం కూడా రోగాలు వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. పరిస్థితి ఇంతగా విషమిస్తున్నా…స్వచ్ఛత చర్యలు చేపట్టడంతో అధికారులు, పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. కనీసం ఫాగింగ్ కూడా చేపట్టకపోవడంతో జనమంతా దోమకాట్లతో జ్వరాలబారిన పడుతున్నారు.
Tags:Viral Fever in Infinity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *