అందుబాటులోకి వర్చువల్ డెబిట్ కార్డ్
ముంబై ముచ్చట్లు:
బ్యాంకింగ్ సర్వీసులన్ని సులభంగా మారిపోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుల్లో ప్రజలు బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడకుండా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వంటి ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో డెబిట్ కార్డు చాలా ముఖ్యమైనది మారిపోయింది. కొన్ని కొన్ని సందర్భాలలో డెబిట్ కార్డు వెంట ఉంచుకోలేము. అలాంటి సమయంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సమయానికి డెబిట్ కార్డు మన వద్ద లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ సమస్యను అధిగమించడానికి దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్బీ) తన కస్టమర్లకు వర్చువల్ డెబిట్ కార్డ్ సౌకర్యాన్ని అందించడం ప్రారంభించింది. ఇప్పుడు వినియోగదారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్డ్ పోయినట్లయితే పిఎన్బీ వన్ యాప్ ద్వారా వర్చువల్ డెబిట్ కార్డ్ నుండి నగదును విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం ఉంటుందివర్చువల్ డెబిట్ కార్డ్ సాధారణ డెబిట్ కార్డ్ లాగానే ఉంటుంది. ఇది మీ మొబైల్‌లో వర్చువల్ రూపంలో సేవ్ చేయబడుతుంది. ఈ కార్డ్ ద్వారా మీరు దీన్ని సాధారణ డెబిట్ కార్డ్‌లాగా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ కార్డు డిజిటల్‌గా జారీ చేయబడి ఉంటుంది. మీ కార్డ్ పోయినట్లయితే లేదా మీరు డెబిట్ కార్డ్‌ని వెంట ఉండకపోతే మీరు పిఎన్బీ వన్ ద్వారా వర్చువల్ డెబిట్ కార్డ్‌ని ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డ్‌లో సాధారణ డెబిట్ కార్డ్‌లాగా, సివివి నంబర్, కార్డ్ నంబర్, గడువు తేదీ మొదలైన అన్ని వివరాలు నమోదు చేయబడి ఉంటాయి.
వర్చువల్ డెబిట్ కార్డ్‌ని రూపొందించండిలా..
☛ మీరు పిఎన్బీ వన్ యాప్ ద్వారా పిఎన్బీ వర్చువల్ డెబిట్‌ను పోందాలి.
☛ ఇందుకోసం ముందుగా మీ మొబైల్‌లో పిఎన్బీ వన్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత అందులో మీ ఖాతాను నమోదు చేసుకోండి.
☛ దీని తర్వాత పిఎన్బీ వన్ యాప్‌లో ఎంపిన్ ని నమోదు చేయండి.
☛ తర్వాత మీరు హోమ్ స్క్రీన్‌పై డెబిట్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దానిని దాన్ని ఎంచుకోండి.
☛ తర్వాత రిక్వెస్ట్ వర్చువల్ కార్డ్ ఎంపికను ఎంచుకోండి. మీ ఖాతా సైన్, ఖాతా సంఖ్యను నమోదు చేయండి.
☛ తర్వాత ఈకామ్ లావాదేవీలపై అనుమతించు ఆప్షన్‌ను ఎంచుకోండి.
☛ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
☛ దీని తర్వాత లావాదేవీ పాస్‌వర్డ్, ఓటీపీని ఇక్కడ నమోదు చేయండి.
☛ ఆ తర్వాత మీ వర్చువల్ డెబిట్ కార్డ్ పిఎన్బీ వన్ యాప్ ద్వారా జారీ చేయబడుతుంది.
☛ ఇప్పుడు మీరు ఈ కార్డ్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.
☛ మీరు డెబిట్ కార్డ్‌ని వెంట తీసుకెళ్లడం వల్ల కలిగే ఇబ్బంది నుండి బయటపడతారు.

Tags: Virtual debit card available
