Natyam ad

విశాఖ రాజధాని అడుగులు

…వైసీపీ స్ట్రాటజీ అదేనా

విజయవాడ ముచ్చట్లు:

Post Midle

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మాత్రమే కాదు మొత్తం సమాజానికి  రాజధాని అంశం ప్రధానమైపోయింది. అధికార వైఎస్ఆర్‌సీపీ తాము మూడు రాజధానుల విధానానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు అన్నీ తమ మద్దతు అమరావతికేనని చెబుతున్నాయి. చట్టం,  రాజ్యాంగం కూడా అమరావతికే మద్దతుగా నిలిచింది. అయితే కొత్తగా ఏపీ సీఎం జగన్ .. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలన చేస్తే అదే రాజధాని అని… ఆ విషయాన్ని ఇతరులు నిర్ణయించలేరని చెబుతున్నారు. అదే సమయంలో ఏపీ కేబినెట్‌లో మరో సీనియర్ మంత్రి ధర్మాన.. మూడు రాజధానులు కాదు.. విశాఖ ఒక్కటే రాజధాని అంటున్నారు. ముఖ్యమంత్రి మూడు రాజధానులంటే.. ధర్మాన ఒక్కటే అంటున్నారు. ఆ పార్టీ విధానంలో గందరగోళం ఉందా ? లేక వ్యూహాత్మకంగానే చెబుతున్నారా?ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని.. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని ఓ సందర్భంలో సీఎం జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరోసారి కొన్ని మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్యూల్లో అదే చెబుతున్నారు.  సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేయాలని.. ఎవరెవరో ఎలా నిర్ణయిస్తారు ? ఎక్కడి నుంచి పరిపాలన చేయాలనేది సీఎం ఇష్టం. సీఎం ఎక్కడ ఉంటే.. మంత్రివర్గం అక్కడ ఉంటుంది. మంత్రి వర్గం ఎక్కడ ఉంటే..

 

 

 

 

సచివాలయం అక్కడ ఉంటుంది ! అని జగన్ స్పష్టంగా చెబుతున్నారు. మూడు రాజధానులు అనేది తమ విధానమని.. ఆ అంశం నుంచి వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని చెబుతున్నారు. జగన్ ప్రకటనతో..  కోర్టు తీర్పులు ఎలా ఉన్నా.. సీఎం జగన్ మాత్రం తనంతట తానుగా విశాఖకు వెళ్లి అక్కడే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని పాలన సాగించేందుకు సిద్ధమయ్యారని పలు మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్యూల్లో చేస్తున్న వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ చెబుతున్నారు. కర్నూలుకు న్యాయరాజధాని అని చెబుతున్నారు.  అయితే ఉత్తరాంధ్రలో మాత్రం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఒకే రాజధాని వాదన వినిపించడం ప్రారంభించారు.  ఒకే రాజధాని.. అది విశాఖ మాత్రమే అంటున్నారు.  కర్నూలు నుంచి న్యాయవ్యవహారాలు.. అమరావతి నుంచి శాసన వ్యవహారాలు చక్క బెడతామని.. అంతే కానీ అవి రాజధానులు కాదంటున్నారు. వీటికి ఉదాహరణకు ఒడిషా గురించి చెబుతున్నారు. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ అయితే కటక్‌లో హైకోర్టు ఉందని ధర్మాన గుర్తు చేశారు. అలాగే దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు ఓ చోట… రాజధాని మరో చోట ఉన్నాయని అంత మాత్రాన వాటిని రాజధానులని పిలవడం లేదని పరోక్షంగా గుర్తు చేశారు. ధర్మాన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌సీపీ నేతల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కావడం లేదు. కర్నూలులో హైకోర్టును పెట్టవచ్చు కానీ దాన్ని రాజధానిగా పిలువలేమని ధర్మాన చెబుతున్నారు. అలాగే అసెంబ్లీ ఉన్నంత మాత్రాన అమరావతి రాజధాని కాదని ఆయన అంటున్నారు.

 

 

సాంకేతికంగా ధర్మాన చెప్పింది నిజమేనని నిపుణులు అంటున్నారు. హైకోర్టు పెట్టినంత  మాత్రాన అది న్యాయరాజధాని కాబోదని.. అసలు అలాంటి పదవి వాడుకకు తప్ప.. చట్టాల్లో కానీ.. మరో చోట కానీ ఉండదంటున్నారు. శాసన రాజధాని విషయంలోనూ అంతే. సాధారణంగా పాలన ఎక్కడి నుంచి జరిగితే..దాన్నే రాజధానిగా గుర్తిస్తారు. దర్మాన చెప్పినట్లుగా కటక్‌లో హైకోర్టు ఉంది.. కానీ రాజధానిగా పేర్కొనడం లేదు. కానీ రాజధాని భువనేశ్వర్‌కు .. కటక్‌కు మధ్య గ్యాప్ ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే. అంటే ఓ రకంగా ఆ రెండు జంట నగరాలన్నమాట. నిజానికి హైకోర్టు ఫలానా చోట పెట్టాలని చట్టాలు చేస్తే చల్లవు హైకోర్టు ఎలా ఏర్పాటు  చేయాలన్నదానిపైఓ ప్రక్రియ ఉంటుంది. అది న్యాయవ్యవస్థతో ముడిపడి ఉంటుంది. చట్టం చేసి హైకోర్టును మార్చేస్తే సాధ్యం కాదు. ఓ వైపు అమరావతి  నుంచి పరిపాలన చేస్తూ.. అభివృద్ధి పేరుతో మూడు రాజధానుల నినాదం చేస్తున్నారు. గతంలో  ప్రత్యేకహోదా వస్తే ప్రతీ జిల్లా హైదరాబాద్ అవుతుందని చెప్పిన తరహాలోనే ఇప్పుడు మూడు రాజధానులు చేస్తే అంతా అభివృద్ధి అవుతుందంటున్నారు. అయితే ప్రత్యేకహోదా కు కానీ.. మూడు రాజధానులతో కానీ అభివృద్ధికి సంబంధం  లేదని.. పెట్టుబడులు తీసుకు వచ్చి.. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది. అందుకే వైఎస్ఆర్‌సీపీ గందరగోళంలో పడిందేమో అన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.

 

Tags: Visakha Capital Ft

Post Midle

Leave A Reply

Your email address will not be published.