ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లిన విశాఖ జీవిఎంసీ కౌన్సిల్ సమావేశం
విశాఖపట్నం ముచ్చట్లు:
ముడసర్లోవ పార్క్ ను పీపీపీ పద్దతిలో థీమ్ పార్కుగా చేసేందుకు విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసింది.దీంతో జీవీఎంసీ ఆస్తుల్ని అమ్మేస్తారా అంటూ మేయర్ పోడియంను ప్రతిపక్ష కార్పొరేటర్లు చుట్టుముట్టడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్ధితి తలెత్తింది.ప్రతిపక్షాల నిరసనలు కొనసాగుతున్న సమయంలో ముడసర్లోవ పార్కును పీపీపీ పద్దతిలో ప్రయివేట్ కు అప్పగించేందుకు ఆమోదం తెలిపింది.దీంతో 283 ఎకరాల్లో పార్కు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్దం చేశారు.వైసీపీ పెద్దలకే జీవీఎంసీ భూముల్ని కట్టబెడుతున్నారంటూ టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం కార్పొరేటర్ల నిరసన వ్యక్తం చేశారు.ప్రతిపక్ష, అధికార పార్టీ సభ్యుల మధ్య భారీ తోపులాట చోటు చేసుకుంది.ఓటింగ్ నిర్వహించి ఆమోదం తెలపాలని మేయర్ నిర్ణయంతో 49మంది సభ్యులు ఆమోదం తెలపగా ప్రైవేట్ వ్యక్తుల చేతికి ముడసర్లోవ పార్క్ వెళ్లనుంది.
Tags:Visakha GVMC council meeting resounded with opposition slogans

