విశాఖ ఆఫీసులు… ఫిక్స్…

విశాఖపట్టణం ముచ్చట్లు:


విశాఖ నుంచే పరిపాలన చేపట్టేందుకు సీఎం వైఎస్ జగన్ సన్నద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం విశాఖలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి భవనాలను సైతం ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగంపై ఇప్పటికే ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. రిషికొండ మిలినియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్ కార్యాలయాలకు సంబంధించి స్థలాలను కమిటీ గుర్తించింది. సీఎం, మంత్రులు ఉత్తరాంధ్రలో సమీక్షలకు వెళ్లినప్పుడు ఉపయోగించేందుకు మిలినియం టవర్స్‌లో ఏ, బీ టవర్స్‌ను కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు వివిధ శాఖలకు చెందిన సొంత భవనాలను ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు కేటాయించారు. సొంత భవనాలు లేని శాఖలు, అధికారుల కార్యాలయాలకు మిలినియం టవర్స్‌ను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 2 లక్షల 27వేల చదరపు అడుగుల ప్రభుత్వ భవనాల స్థలాలు గుర్తించారు. మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల చదరపు అడుగుల ఆఫీస్ స్పేష్‌ను గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విశాఖలో ఏ శాఖ కార్యాలయం ఎక్కడ రానుందో అనేదానిపై ఆసక్తికర ప్రచారం జరుగుతుంది.

 

 

 

 

ఇకపోతే ప్రభుత్వ శాఖలకు సంబంధించి మిలీనియం టవర్స్‌తోపాటు పలు ప్రాంతాల్లో కార్యాలయాల కోసం భవనాల ఎంపిక ప్రక్రియకు లైన్ క్లియర్ అయిన సంగతి తెలిసిందే. ఇక రాజధాని తరలింపే ఆలస్యం అని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే విశాఖలో ఏ శాఖ కార్యాలయం ఎక్కడ ఉందో తెలియజేస్తూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వ్యవసాయ,సహకార శాఖ – ఎండాడ(పీఎం పాలెం పోస్ట్), పశుసంవర్ధక శాఖ,మత్స్య శాఖ – హనుమంతవాక(ఆదర్శ్ నగర్), వైద్యారోగ్య శాఖ – హనుమంతవాక, హోంశాఖ – కృష్ణా నగర్(మహరాణిపేట), పరిశ్రమల శాఖ – గవర కంచరపాలెం, పట్టణాభివృద్ది శాఖ – దుర్గానగర్, అరిలోవ, ఎంవీపీ కాలనీ, పెందుర్తి, మద్దిల పాలెం, సిరిపురం సర్కిల్, దేవదాయశాఖ – సింహాచలం, పాఠశాల విద్యాశాఖ – భీమునిపట్నం, రవాణా,రోడ్లు-భవనాలు – మర్రిపాలెం, గిరిజన సంక్షేమ శాఖ – రుషికొండ వంటి ప్రాంతాలలో శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

 

 

 

Post Midle

ఇదిలా ఉంటే అధికారుల నివాసాలకు సైతం భవానలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ – విశాలాక్షి నగర్, పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖ గెస్ట్ హౌస్ – కైలాసగిరి, జలవనరుల శాఖ గెస్ట్ హౌస్ – పెద వాల్తేరు, టూరిజం గెస్ట్ హౌస్ – హరిత రిసార్ట్స్‌లలో అధికారుల నివాసాలకు భవనాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు మిలీనియం టవర్స్‌లో ఏర్పాటుచేసే క్యాంప్ ఆఫీసుల వివరాలను సైతం ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తోంది. జీఏడి,ఇంధన,ఆర్ధిక శాఖ, ప్లానింగ్, న్యాయశాఖ,ఉనత విద్యా శాఖ, గృహనిర్మాణ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కార్మికశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ, సోషల్ వెల్ఫేర్, ఆర్టీజీఎస్ క్యాంప్ ఆఫీసులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

 

Tags: Visakha Offices… Fix…

Post Midle