Natyam ad

లాభాలబాటలో విశాఖ పోర్టు ట్రస్ట్

విశాఖపట్నం     ముచ్చట్లు:

90 ఏళ్ల పోర్ట్ ట్రస్ట్ చరిత్రలో 73.75 మిలియన్స్ కార్గో హ్యాండిల్ చేయడం జరిగిందని పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కే రామ్మో హన్ అన్నారు. అక్కయ్యపాలెం పోర్టు కళావాణి సమావేశ మందిరంలో ఏర్పా టుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.మేజర్ పోర్టుల లో విశాఖ పోర్టు ట్రస్ట్ నాలుగవ ర్యాం కు లో ఉందన్నారు. ఈస్ట్ కోస్ట్ లో సెకండ్ ర్యాంకులో ఉందని వెల్లడించా రు. పోర్ట్ ట్రస్ట్ అభివృద్ధికి కృషి చేయ డం జరుగుతుందన్నారు.ఇన్నర్ హార్బర్లో కూడా పెద్ద షిప్స్ ను తీసుకొ చ్చే విధంగా రూపకల్పన చేసామన్నా రు. అలాగే ఆపరేషన్ లో లేకుండా ఉన్న ఆరో నెంబర్, ఆదానీ బెర్త్ లును ఉపయోగించి 119 కోట్లు అదనపు ఆదాయం సమకూర్చమన్నారు. 7500 ఎకరాలు కలిగిన పోర్ట్ ట్రస్ట్ స్థలాలలో నిరుపయోగంగా ఉన్న భూములకు పబ్లిక్ ప్రైవేట్ పద్ధతిలో లీజుకిస్తూ ఫిక్స్డ్ అమౌంట్ లో వడ్డీ రూపంలో సంవత్సరానికి అదనపు కోట్లు ఆదాయం వచ్చేలా చేసామన్నారు. పోర్ట్ ట్రస్టులో అనేక మార్పులు తీసుకువచ్చి ఆదాయాన్ని పెంచే మార్గాలని అనుసరిస్తున్నామని వెల్లడించారు. కార్గో హ్యండల్ ద్వారా 1700 కోట్లు ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా తెలిపారు

Post Midle

Tags;Visakha Port Trust on the road to profit

Post Midle