విశాఖను రాజధానిగా చేయాలి

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడంతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి ఫలం దక్కుతుందని ఉత్తరాంధ్ర మేధావుల జాయింట్ యాక్షన్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. విశాఖ నగరంలోని ప్రెస్ క్లబ్ లో మూడు రాజధానుల అంశంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమార్ మాట్లాడుతూ అమరావతి రైతులకు తాము వ్యతిరేకం కాదని, అలాగని మా ప్రాంతానికి వచ్చి అమరావతిని రాజధాని చేయాలని కోరడం సరికాదని అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని చేయడం ద్వారా రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు.

 

Tags: Visakha should be made the capital

Leave A Reply

Your email address will not be published.