Natyam ad

విశాఖ స్టీల్ కార్మికుల నిరసన

విశాఖపట్నం ముచ్చట్లు :


విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని గడిచిన 700 రోజులుగా అనేక ధర్నా లు, నిరసనలు తెలియజేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం చలనం  లేకపోవడం బాధాకరం అని ఉక్కు యువ కార్మికులు తెలిపారు. ఈ నెల 30  తేదీన స్టీల్ ప్లాంట్ కృష్ణ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు.  వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలను కలిసి తమకు మద్దతుగా వుండాలని అన్నారు. దానిలో భాగంగా  జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  శ్రీకాకుళం జిల్లా రణస్థలం దగ్గర, యువశక్తి అనే కార్యక్రమానికి హాజరవుతున్నారు అని తెలిపారు.  విశాఖ ఉక్కు ఉద్యోగులు 300 లకు పైగా రణస్థలంకు వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ నెల 30న జరుగుతున్న కార్యక్రమంనికి ఆహ్వానించి మా ఉద్యమం నికి మద్దతు తెలియజేయాలని కోరతామని వారు అన్నారు.

 

Tags: Visakha Steel workers protest

Post Midle
Post Midle