విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

Date;28/02/2020

విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

విశాఖపట్నంముచ్చట్లు:

ఎక్కడినుంచే మనుషులను తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు. పులివెందులనుంచి రౌడీలను రప్పించి దాడి చేయించారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర టూరిజం శాఖమంత్రి  అవంతి  శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. బయట నుంచి రౌడీలు వచ్చారని నిరూపించకపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటారా. చంద్రబాబుకు సవాల్  చేస్తున్నాను. నిరూపిస్తే నేను రాజీనామాకు రెడీ అని సవాల్ విసిరారు.
అమరావతికి మధ్దతు తెలిపితే విశాఖ టిడిపి ఎంఎల్ఏ లు వెంటనే రాజీనామా చేయాలి. పోలీసులు, మహిళలపట్ల చంద్రబాబు తీరు దారుణం గా ఉంది. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. మండుటెండలో ఆరుగంటలపాటు ధర్నా చేశారు.ఈ నిరసనలను చంద్రబాబు గమనించాలని అన్నారు. ధర్నాలో  పాల్గొన్నవారందరూ స్వఛ్చందంగా వచ్చారు. ఇళ్ళకు వచ్చి దౌర్జన్యాలు చేస్తామని లోకేష్ అనడం దారుణమని అన్నారు. లోకేష్ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. అన్ని జిల్లాలను
రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృధ్ది చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు పట్ల ఆగ్రహం గా ఉన్నారు. ప్రజల మనోభావాలను చంద్రబాబు గౌరవించాలి.
టిడిపి హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని వివరించారు.

 

Tags;Visakha TDP MLAs should resign

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *