Vishakha Calamity Effect

విశాఖ దుర్ఘటన ఎఫెక్ట్

Date:08/05/2020

విశాఖపట్నం ముచ్చట్లు:

విశాఖ దుర్ఘటన ఎఫెక్ట్.. 9 శ్రామిక్ రైళ్ల రాకపోకలకు అంతరాయం

– సింహాచలం మీదుగా వెళ్లాల్సిన రైళ్లను ఆపివేసిన అధికారులు

– తీవ్ర అస్వస్థతకు లోనైన స్టేషన్ సిబ్బంది

– 12 గంటల వరకు నిలిచిపోయిన రైళ్లు

★ విశాఖపట్టణంలో నిన్న జరిగిన ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన కారణంగా వలస కార్మికులతో వెళ్లాల్సిన 9 శ్రామిక్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

★ ఘటన సంభవించిన ఎల్‌జీ పాలిమర్స్‌కు సమీపంలోనే సింహాచలం రైల్వే స్టేషన్ ఉంది.

★ విషవాయువుల లీకేజీ కారణంగా స్టేషన్‌లోని సిబ్బంది కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

★ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్ల మంటలు, వికారం వంటి సమస్యలతో బాధపడ్డారు. దీంతో సింహాచలం స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన శ్రామిక్ రైళ్లను పరిస్థితి కుదుటపడే వరకు నిలిపివేశారు.

★ ఫలితంగా 8:35 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ స్టేషన్‌ మీదుగా వెళ్లాల్సిన 9 రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ఔరంగబాద్‌లో ఘోర రైలు ప్రమాదం

Tags: Vishakha Calamity Effect

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *