ఐటీకి కీలకంగా విశాఖ : మంత్రి లోకేష్ 

Vishakha is the key to IT: Minister Lokesh

Vishakha is the key to IT: Minister Lokesh

Date:10/08/2018
విశాఖపట్నం ముచ్చట్లు:
 ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పుతున్న ఐటి కంపెనీలలో 60 శాతం కంపెనీలు విశాఖలోనే వస్తున్నాయని, విశాఖ ఐటీకి కీలకంగా మారబోతోందనీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో నేడు పలు ఐటీ కంపెనీలను ప్రారంభించిన అనంతరం టెక్ మహీంద్రా లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ 2020 – 24 నాటికి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతీ యువకులు ఉండరన్నారు. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 2019కి రాష్ట్రంలో ఒక లక్ష ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యం అయితే ఇప్పటికే 36 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. విశాఖలోని కాపులుప్పాడ వద్ద ఐటీ పార్క్ లో నాలుగు ఫేసులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. తద్వారా ఒక లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ఐటీ డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుందని కితాబిచ్చారు.
Tags; Vishakha is the key to IT: Minister Lokesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *