తెరంగ్రేటం చేయనున్న విష్ణు  కుమార్తెలు

హైదరాబాద్ ముచ్చట్లు:


మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా సింగర్స్ గా, యాక్టర్స్ గా పరిచయమవుతున్నారు. ఈ విషయాన్ని తాజాగా విష్ణు ఒక లేఖ ద్వారా తెలియజేశాడు.విష్ణు హీరోగా ‘జిన్నా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈషన్ సూర్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌ నటిస్తుండటం విశేషం. ‘జిన్నా’పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విష్ణు.. ఈ సినిమా కోసం స్టార్ యాక్టర్స్ ని, టాప్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దింపుతున్నాడు. అంతేకాదు విష్ణు కుమార్తెల చేరికతో ఈ సినిమాకి మరింత ప్రత్యేకత ఏర్పడింది. ఇందులో అరియానా, వివియానా ఒక పాట పాడారు. ఈ సాంగ్ కి సంబంధించిన వీడియో జులై 24న రిలీజ్ కానుందని ఒక లేఖ ద్వారా తెలిపాడు విష్ణు. ఆ లేఖలో తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించినట్లుగానే, తన కూతుర్లను కూడా ఆదరించాలని కోరాడు.అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి కోన వెంకట్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఒక సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించడం విశేషం.

 

Tags: Vishnu’s daughters who are going to perform their wedding ceremony

Leave A Reply

Your email address will not be published.