స్వామివారి పాదాలు తొలగించొద్దంటూ విశ్వహిందూ పరిషత్ ,భజరంగ్ దళ్  నిరసనలు

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:
 
యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా గుట్టపైకి కాలి నడకన మెట్ల ద్వారా వెళ్ళే మార్గాన ఉన్నటువంటి పాదాల గుడిని వై టి డీ ఎ అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని గతంలో తొలగించినటువంటి పాదాల మెట్ల ఆర్చిని తిరిగి పునార్మించాలంటు విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్వామి వారి పాదాల ఆలయం వద్ద నిరసనలు చేపట్టారు.పవిత్రమైన పాదాలను కాపాడుకునే బాధ్యత మనందరికి ఉందని వారు అన్నారు.అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసే క్రమంలో కొద్దిగా ఆందోళన చోటు చేసుకుంది. ఆలయ అధికారి తనకి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేసారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈవో చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని  పాదాలను తొలగించే ప్రయత్నం చేస్తే  పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి ఎచ్ పి మండల అధ్యక్షులు గారెడ్డి బాపురెడ్డి,విభాగ సహాయ కార్యదర్శి తోట భానుప్రసాద్, కర్రే ప్రవీణ్, కోకల సందీప్ తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Vishwa Hindu Parishad and Bhajarang Dal protest as Swami’s feet are removed

Leave A Reply

Your email address will not be published.