Natyam ad

చేయూత పథకంలో విశ్వబ్రాహ్మణలకు అవకాశం కల్పించాలి

కాజోలు ముచ్చట్లు:
 
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పర్యటిస్తున్న జనసేన నేత నాదెండ్ల మనోహర్ కి విశ్వబ్రాహ్మణులు వినతిపత్రం అందజేసారు. అనాదిగా చేతి వృత్తులపై ఆధారపడిన విశ్వబ్రాహ్మణులు కార్పొరేట్ వ్యవస్థలు రాకతో జీవనోపాధి కోల్పోయామని చేతి వృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకంలో మాకు అవకాశం కల్పించాలని కోరారు. న్యాయబద్ధమైన విశ్వబ్రాహ్మణుల సమస్యను అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేకూరేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని మనోహర్ హామీ ఇచ్చారు. మనోహర్ వెంట జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పితాని బాలకృష్ణ, డీఎంఆర్ శేఖర్ బాబు, దాసరి బాలాజీ, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, తాడి మోహన్ ఉన్నారు.
 
Tags: Vishwabrahmins should be given a chance in the Cheyuta scheme