బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్ర‌ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన విశ్వ‌క్ సేన్

Date:03/09/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ కృష్ణ మరియు రష్మీ గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం “బొమ్మ బ్లాక్ బస్టర్ష‌.  ఈ రోజు నందు పుట్టిన రోజు సందర్భంగా నందు ని ‘పోతురాజు’ గా పరిచయం చేస్తూ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ఈ చిత్ర‌ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రంలో హీరో నందు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ కి అభిమానిగా న‌టిస్తున్నారు. ఈ క్యారెక్ట‌ర్ చాలా వైవిధ్యంగా ఉండ‌బోతుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. పోతురాజుగా క‌నిపించ‌బోతున్న నందు క్యారెక్ట‌ర్ కి ధిటుగానే హీరోయిన్ ర‌ష్మీ గౌత‌మ్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని, దీనికి సంబంధించిన వివరాల్ని అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించబోతున్నారు. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శ‌కునిగా చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ తో అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని  విడదులకు సిద్ధంగా ఉందిని చిత్ర నిర్మాత‌లు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు.

మొద‌టి సినిమా చేసిన ద‌ర్శ‌కుడితోనే 25వ సినిమాగా ‘వి’ చేయ‌డం యాదృచ్చికం :  నాని

Tags: Vishwak Sen released the first look of the toy blockbuster movie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *