Natyam ad

గాయాత్రిదేవిగా దుర్గమ్మ దర్శనం

విజయవాడ ముచ్చట్లు:


ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో రోజు గాయత్రిదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు.స్తున్నారు. సకల వేద స్వరూపం గాయత్రిదేవి.. అన్నిమంత్రాలకు మూలశక్తి అమ్మవారు. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిచ్చారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి.. మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం దక్కుతుంది.గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రిమాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. గాయత్రిమంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారికి కొబ్బరి అన్నం, పాయసం, అల్లపుగారెలు నివేదన చేస్తారు. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేసి,గాయత్రి స్తోత్రాలు పారాయణ చేయాలి. గాయత్రి దేవి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు.

 

Tags: Vision of Durgamma as Gayatri Devi

Post Midle
Post Midle