మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు దర్శనం

Vision to the devotees during the Maha Pratap

Vision to the devotees during the Maha Pratap

Date:17/07/2018
అమరావతి ముచ్చట్లు:
తిరుమల పుణ్యక్షేత్రంలో మహా సంప్రోక్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం నాడు అయన టిటిడి, సీఎంవో అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.  మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజుల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై జరుగుతున్న వివాదంపై స్పందించిన చంద్రబాబు భక్తులకు ఇబ్బంది కలిగేలా నిర్ణయాలు ఉండొద్దని టీటీడీకి సూచించారు.  ఆగమ శాస్త్రానుసారం పూజా కార్యక్రమాలు నిర్వహించాలి.పూజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలి. పరిమిత సంఖ్యలో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు. గతంలో 1994, 2006 సంవత్సరాల్లో ఇదే క్రతువు జరిగినప్పుడు పాటించిన నిబంధనలనే ఇప్పుడూ పాటించాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. రోజుల తరబడి భక్తులు దర్శనానికి ఎదురుచూసేలా చేయరాదని అన్నారు. మహా సంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని ఆదేశించారు.తిరుమల తిరుపతి  ఈవో సింఘాల్ మాట్లాడుతూ మహాసంప్రోక్షణలో ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించలేమన్నారు. సెలవు రోజులు కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తే ఇబ్బంది కలుగుతుందనే దర్శనాలు రద్దు చేయాలని పాలక మండల నిర్ణయించిందని పేర్కొన్నారు. కొంత మంది కావాలనే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారన్నారు.
మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు దర్శనం https://www.telugumuchatlu.com/vision-to-the-devotees-during-the-maha-pratap/
Tags:Vision to the devotees during the Maha Pratap

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *