Natyam ad

జక్కంపూడిలో దేవినేని పర్యటన

విజయవాడ ముచ్చట్లు:


మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి కాలనీ కు బస్సు లో వెళ్లారు. విజయవాడ నగర శివారు జక్కంపూడి కాలనీలో 5వ రోజు ఆత్మీయ సమావేశాలు కొనసాగాయి. కాలనీలోని బ్లాకుల్లో తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా ఉండి మంచినీటికి సైతం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అయనకు తెలిపారు. రాత్రిళ్ళు వీధిలైట్లు లేక గంజాయి,  బ్లేడ్ బ్యాచ్ తో భయం గుప్పెట్లో బతుకుతున్నామంటూ మహిళల ఆవేదన వ్యక్తం చేసారు. పాలకపక్షం, అధికారులు సైతం మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదంటూ దేవినేని ఉమాకు  స్థానికులు, మహిళల వినతులు ఇచ్చారు.

 

Tags: Visit to Devineni at Jakkampudi

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.