Natyam ad

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దంపతులు

తిరుపతి ముచ్చట్లు:
 
నూతన సంవత్సరం సందర్భంగా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామిని వైఎస్సార్ కడప జిల్లా, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఎంపీ దంపతులకు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనానంతరం ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా గడపాలని ఆయన కోరారు. అంతకుముందు ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆత్మీయ ఆలింగణంతో అభిమానాన్ని చాటుకున్నారు.

పుంగనూరు ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడుగా ముత్యాలు
Tags: Visiting Sri Kalyana Venkateswara Swami .. Rajampeta MP Mithun Reddy couple