Vissar insurance coverage for every family with a rice card from today

బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నేటి నుంచి వైస్సార్ భీమా అమలు

Date:21/10/2020

అమరావతి ముచ్చట్లు:

రేషన్ కార్డున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచేలా ‘వైయస్సార్‌ బీమా పథకాన్ని’ ప్రారంభించనుంది. కుటుంబ పెద్ద సాధారణ లేక ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబాన్ని ఆదుకోవటమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కోసం ఇప్పటికే 510 కోట్లకు పైగా నిధుల కేటాయించింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 1 కోటి 41 లక్షల కుటుంబాలకు లబ్ది చేకురనుంది.18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తించనుంది. 18-50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి 5 లక్షలు బీమా పరిహారం చెల్లించనుంది ప్రభుత్వం.ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందితే 5 లక్షలు బీమా పరిహారం ఇవ్వనుంది. 51-70 ఏళ్ల మధ్య వయస్సు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి 3 లక్షల పరిహారం,శాశ్వత అంగవైకల్యం పొందితే 3 లక్షలు బీమా పరిహారం చెల్లించనుంది. వైయస్సార్‌ బీమా పథకంలో పూర్తి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించనుంది.

శ్రీవారి వసంతోత్సవం

Tags; Vissar insurance coverage for every family with a rice card from today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *