వైస్సార్ కల్యాణ మస్తు  పేదింటి ఆడపిల్లలకు ఆసరా

కడప ముచ్చట్లు:


ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి : ఆడపిల్లలను కన్న పేద తల్లిదండ్రులుకు పెళ్లి కార్యక్రమం మోయలేని భారం అయి,అప్పులు పాలు కాకూడదనే ఉద్దేశ్యంతో గతంలో ఇచ్చే ఆర్ధిక సాయం కన్నా ఇంకా పెంచి ఎక్కువ మందికి  అధిక మోతాన్ని ఆ తల్లిదండ్రులు కి ఆర్ధిక సాయం చేయాలని రూపొందించిన పథకమే ఈ వైస్సార్ పెళ్లి కానుక.ఇప్పుడు ఈ పథకాన్ని పేరు మార్చి వైస్సార్ కల్యాణ మస్తు గా నామకరణం చేయడం జరిగింది.ఇప్పటివరకు మ్యానిఫెస్టోలో చెప్పిన పథకాలు అన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈ 3 సంవత్సరాలలో దాదాపు 95% హామీలు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇవ్వబోయే కల్యాణ మస్తు పథకం కూడా ప్రారంభం కి నోచుకోవడం వల్ల ఇప్పుడు దీంతో 98.44% ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని
చైతల్య సంపత్ లు తెలిపారు.

 

 

ఈ వైస్సార్ కల్యాణ మస్తు పథకం
ఈ 2022 వ సంవత్సరం అక్టోబర్,1 వతేదీ నుండి ఈ పతకం ప్రారంభమ గునురాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రకారం నిరు పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ  మైనారిటీ కులాలకు చెందిన తల్లిదండ్రులు కి ఈ ఆర్ధిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.
ఎస్సీ కులానికి చెందిన వారికి 1లక్ష రూపాయలు సహాయం చేయబడును
ఎస్సీ లో కులాంతర వివాహం చేసుకున్న వారికి 1లక్ష 20 వేల రూపాయలను అందిచనున్నారు.
ఎస్టీ కులానికి చెందిన వారికి కూడా 1లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు.
ఎస్టీ లలోని వారు కులాంతర వివాహం చేయూకున్న వారికి 1లక్ష 20 వేల రూపాయలని అందిచనున్నారు.

 

 

 

బిసికులాల వారికి గతం కన్నా మిన్నగా 50 వేల రూపాయలు ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నారు.
బీసీ లలో కులాంతర వివాహం చేసుకున్న వారికి 75 వేల రూపాయలు ను అందిచనున్నారుమైనారిటీ కులాలకు చెందిన వారికి షాదీ తోఫా పేరుతో 1 లక్ష రూపాయలను ఆ పేద కుటుంబానికి పెళ్లి కార్యక్రమం కోసం ఇవ్వనున్నారు.
ఏ కులానికి చెందిన వారైననూ, వారు దివ్యా0గులు అయి ఉంటే అలాంటి వారికి 1 లక్ష 50 వేల రూపాయలను ఇచ్చి వారికి తోడుగా వుండనున్నారు.
అదేవిధంగా ఏ కులాల వారైననూ భవన కార్మికుల వివాహాలకు అయితే 40 వేల రూపాయలను అందిచనున్నారని తెలిపారు ఈ పధకానికి అర్హులైన అందరూ దరఖాస్తు చేసుకుని లబ్ది పొందాలని ఇంతటి మంచి పధకాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి మంచి చేసే మా నాయకులు అంజాద్ బాష సురేష్ బాబు  కృతజ్ఞత లు తెలిపారు.

 

Tags: Vissar Kalyana Mastu is a support for poor girls

Leave A Reply

Your email address will not be published.