విశ్వరూపం2 రివ్యూ

Date:10/08/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
న‌టీన‌టులు: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ తదితరులు.
మ్యూజిక్: మహమ్మద్‌ గిబ్రాన్‌
ప్రొడ్యూసర్: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్
రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌
నటనలో కమల్ హాసన్ కు తిరుగులేదు. కమల్ లో మంచి నటుడే కాదు అంతకుమించిన టెక్నీషియన్ ఉన్నాడు.  చెప్పాల్సిన కథను సూటిగా చెప్తూ సినిమా తియడంలో కమల్ స్పెషలిస్ట్ ఆవిధంగానే విశ్వరూపం సినిమా తీసి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించారు. ఇప్పుడు అదే కథ సీక్వెల్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి విశ్వరూపం-2లో కమల్ చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాడా..? ఫస్ట్ పార్ట్ మాదిరిగా ఇక్కడా హిట్ కొట్టాడా..?స్టోరీ: ఇండియ‌న్ ‘రా’ ఆదేశాల మేర‌కు ప‌నిచేసే సైనిక గూఢ‌చారి విసామ్ అహ్మ‌ద్ క‌శ్మీరీ (క‌మ‌ల్‌హాస‌న్‌). అల్‌ఖైదా టెర్రరిస్టులతో కలిసి వాళ్ల వ్యూహాలను సైన్యానికి చేరవేస్తూ దాడుల్ని ఆపుతుంటాడు. ఐతే విసాఘ్ విషయం తెలిసిన టెర్రరిస్ట్ ఒమర్ ఖురేషి (రాహుల్ బోస్) విసామ్ ను చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అంతేకాకండా భారత్ లో 64 చోట్ల బాబుదాడులు జరిపేందుకు వ్యూహాల పన్నతాడు. యూకే స‌ముద్ర అంత‌ర్భాగంలో ఒక నావ‌లో ఉన్న బాంబుల్ని పేల‌కుండా అడ్డుకోవ‌డంతో పాటు, ఒమ‌ర్ ఖురేషిని విసామ్ ఎలా అంతం చేశాడు? నిరుప‌మ (పూజా కుమార్‌), అస్మిత (ఆండ్రియా), విసామ్‌కి ఎలా సాయం చేశారో తెర‌పైనే చూడాలి.ఎలా ఉంది?: యూకే నేప‌థ్యంలో స్టోరీ మొదలవుతుంది.  తాను గూఢ‌చారిగా ఎలా మారాడు? అల్‌ఖైదా స్థావ‌రాల్లోకి ఎలా ప్ర‌వేశించాడు? అక్క‌డ ఏం జ‌రిగింది? ఎలా తిరిగొచ్చాడ‌నే విష‌యాలు ఫ్లాష్‌బ్యాక్‌గా వ‌స్తాయి. ఆ త‌ర్వాత యూకేలోనే విసామ్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంది. అక్క‌డ తీర్చిదిద్దిన యాక్ష‌న్ ఎపిసోడ్ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. అప్ప‌టిదాకా న‌త్త న‌డ‌క‌న సాగిన‌ట్టుగా అనిపించిన క‌థ కూడా ప‌ట్టాలెక్కిన‌ట్టుగా అనిపిస్తుంది. కానీ, ఆ ఎపిసోడ్ త‌ర్వాత క‌థ ఎక్క‌డ మొద‌లైందో మళ్లీ అక్క‌డికే వస్తుంది. రా అధికారులకు, క‌మ‌ల్‌హాస‌న్‌కు మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. చెప్పడానికి ఏమీ లేకపోయినా డైలాగ్స్ సీన్లను సాగదీశారు. అప్ప‌టిక‌ప్పుడు యూకేలో బాంబు పేలుడు జ‌రగ‌కుండా ఓ యాక్ష‌న్ ఎపిసోడ్ మొద‌లవుతుంది. దాంతో సినిమాకి ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.  ఆ త‌ర్వాత స్టోరీ ఢిలీకి షిఫ్ట్ అవుతుంది. త‌ల్లీ, కొడుకుల‌ మ‌ధ్య సెంటిమెంట్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఆ త‌ర్వాత ఖురేషీ గ్యాంగ్‌, విసామ్ మ‌ధ్య యుద్ధం మొద‌ల‌వుతుంది. విసామ్‌కు కాబోయే భార్య నిరుప‌మను, త‌ల్లిని కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ నుంచి వాళ్ల‌ని ఎలా రక్షించాడు? ఖురేషినీ ఎలా అంతం చేశాడు? ఇండియాలో 64 చోట్ల పెట్టిన బాంబుల్ని కూడా పేల‌కుండా ఎలా అడ్డుకున్నాడ‌నే విష‌యాల‌తో శుభం కార్డు ప‌డుతుంది. క‌థంతా ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగిపోతుంటుంది.ఎవ‌రెలా చేశారంటే: కమల్ హాసన్ నటన సినిమాకు హైలెట్  ముఖ్యంగా తొలి స‌గ‌భాగంలో ఈశ్వ‌ర ‌శాస్త్రితో క‌లిసి చేసిన స‌న్నివేశాలు, అక్క‌డ సంభాష‌ణ‌లు, ద్వితీయార్ధంలో త‌న త‌ల్లిగా న‌టించిన వహీదా రెహమాన్‌తో క‌లిసి నటించిన తీరు బాగుంటాయి. క‌మల్ చేసిన యాక్ష‌న్ ఘ‌ట్టాలు కూడా స‌హ‌జంగా సాగుతాయి. సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకొన్నారు. పూజా కుమార్, ఆండ్రియా నటనతో పాటు గ్లామరస్ గా కనిపించారు. ఆర్మీ ఆఫీసర్ గా శేఖర్ కపూర్, ఒమ‌ర్ ఖురేషీగా రాహుల్ బోస్ చాలా బాగా న‌టించారు. రాహుల్ బోస్ యాక్టింగ్ చాలా నాచురల్ గా సాగుతుంది. వహీదా రెహమా న్ అల్జీమర్స్ వ్యాధితో బాధప‌డుతున్న త‌ల్లి పాత్ర‌లో న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. జిబ్రాన్ సంగీతం, శ్యాం ద‌త్‌, షాను జాన్ వ‌ర్గీస్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. క‌మ‌ల్‌హాస‌న్ తొలి భాగంతో పోలిస్తే ద‌ర్శ‌కుడిగా, క‌థ‌కుడిగా కాస్త నిరాశ‌ప‌రుస్తాడు. సంభాష‌ణ‌లు సామాన్య ప్రేక్ష‌కుల‌కు ఒక ప‌ట్టాన అర్థం కాని రీతిలో, నిగూఢ‌మైన అర్థాల‌తో వినిపిస్తుంటాయి.
ప్లస్ పాయింట్స్
+ స్టోరీ
+ న‌టీన‌టులు
+ యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్
– స్టోరీ, స్క్రీన్ ప్లే
– కాస్త సాగ‌దీత‌గా అనిపించే ప్ర‌థ‌మార్ధం
Tags; Viswaroopam 2 Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *