కమలం గూటికి వివేక్ సోదరులు

Date:20/07/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ సోదరులు బీజేపీలో చేరేందుకు ముహేర్తం ఖరారైంది. పార్టీలో చేరాలంటూ బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానం రావడంతో త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు 15 రోజులుగా బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వంతో జరిగిన చర్ఛలు సణలం కావడంతో వివేక్‌ బీజేపీలో చేరటానికి అంగీకరించిన తెలుస్తోంది. వివేక్‌తోపాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్‌, వారి అనుచరులు బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

 

 

 

లోక్‌సభ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దపల్లి టికెట్‌ ఆశించినా వివేక్‌కు ఇవ్వలేదు. దాంతో ఆయన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేయడంతోపాటు టీఆర్‌ఎ్‌సకు గుడ్‌బై చెప్పారు. అప్పట్లోనే పెద్దపల్లి లోక్‌సభ టికెట్‌ను ఆయనకు ఇవ్వడానికి బీజేపీ సిద్ధమైంది. కానీ, ఎన్నికలకు సమయం తక్కువ ఉండడంతోపాటు ఇతర కారణాల వల్ల ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో మరోసారి చర్చలు కొనసాగుతున్నాయి.

పాలమూరులో కాంగ్రెస్ ఎదురీత

Tags: Vivek brothers to Kamal Gutti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *