వివేకా హత్యకేసు విచారణ…డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

– రాష్ట్ర పోలీసులకు సంబంధం లేదు
విశాఖపట్నం ముచ్చట్లు:
 
వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ విచా రిస్తోందని,రాష్ట్ర పోలీ సులకు ఎటువంటి సంబంధం కానీ ఒత్తిళ్లు కానీ లేవని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి స్పష్టం చేశారు.గంజాయి సాగు,అక్రమ రవాణా నియంత్రణకోసం ఒడిషాతో కలిసి జాయింట్ ఆపరేషన్లు నిర్వ హించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని గంజా యి సాగు, అక్రమ రవాణాపై నియంత్రణ కొనసాగుతుం దని చెప్పారు.కౌంటర్ ఇంటెలిజెన్స్ యాక్టివ్ గా వర్క వుట్ చేస్తోందని,డ్ర గ్స్ అక్రమ రవాణా,వినియోగంపై నిఘా వుందని తెలిపారు.కాలేజీలు, రిసార్ట్స్,కాటేజ్ లపై ప్రత్యేక దృష్టి సారించామని,లా&ఆర్డర్,క్రైమ్, ట్రాఫిక్ సమస్య లపై సమీక్ష జరిగిందని తెలిపారు.విశాఖ సిటీలో ట్రాఫిక్ నియం త్రణలో సమన్వయ లోపం వుందని ప్రజలకు అసౌకర్యం కలుగ కుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆదే శాలు జారీ చేశామని తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రజల్లో అవగాహన పెరగ డం, కేసుల దర్యాప్తులో వేగవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తు న్నాయ ని చెప్పారు.చాలా సందర్భా ల్లో మోసగాళ్ళు ఖండాంతరాల్లో వుం టున్నారని,అటువంటి కేసుల పరిష్కా రం కొంత సంక్లిష్టంగా ఉంటుందని , గ్రామ సచివాలయ పోలీసులు అందు బాటులోకి వస్తే మరింత పటిష్ట మైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
 
Tags: Viveka murder trial… DGP Rajendranath Reddy

Natyam ad